“బాగుంది” టీజ‌ర్ లాంచ్ చేసిన వేణు ఉడుగుల

135

కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ తేజ – భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ “బాగుంది”. శ్రీరామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్ ,దేవిశ్రీ పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్ లాంచ్ చేయ‌గా.. ఫస్ట్ లుక్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లాంచ్ చేశారు.

అనంతరం చీఫ్ గెస్ట్ దర్శకులు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ కుమార్ చాలా పెర్ఫెక్ట్ గా తీశారు. నిర్మాతలు క్వాలిటీ విష‌యంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. వారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు వచ్చి మరిన్ని సినిమాలు తియ్యలని కోరుకుంటున్నాను.. అన్నారు.

మరో అతిథి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… బాగుంది సినిమా దర్శకులు రామ్ కుమార్ కి సూపర్ స్టార్ కృష్ణ గారి తో పని చేసిన అనుభవం ఉంది. నేను కూడా కృష్ణతో సర్వాయి పాపన్న సినిమా చేశాను. లెజెండ్స్ తో పనిచేసిన డైరెక్టర్ రామ్ కుమార్ “బాగుంది” సినిమా చాలా బాగా తీశారు. టీజర్ చూశాక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తీసినట్టు అనిపిస్తుందని. హీరో కిషోర్ తేజ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా మంచి సక్సెస్ కావాలి. సినిమా విడుద‌ల సమయంలో నా వంతు సాయం అందిస్తాను అని అన్నారు.

మరో గెస్ట్ నిర్మాత సెవన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. “బాగుంది” సినిమా డైరెక్టర్ రామ్ కుమార్ ఎప్పటి నుంచో మిత్రుడు. ఇప్పటి వరకు చాలా మంచి సినిమాలు తీశారు. మంచి హార్డ్ వర్కర్. ప్రస్తుతం “బాగుంది” బాగా తీశారు.. సినిమా సక్సెస్ అవ్వాలని, భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు..

చిత్ర నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ… డైరెక్టర్ రామ్ కుమార్ చిన్ననాటి స్నేహితుడు ఓ సినిమా చేద్దామన్నారు. కథ విన్నాను బాగా నచ్చింది. సినిమాపై నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. అన్ని డైరెక్టర్ దగ్గరుండి చూసుకొని సినిమాను పూర్తిచేశారు. మా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకులు రామ్ కుమార్ మాట్లాడుతూ… శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన “బాగుంది” సినిమా సస్పెన్స్ జానర్ లో తీశాము. సినిమా చూస్తే అంతా థ్రిల్ అవుతారు. కథ చెప్పకుండానే నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు సినిమా చేద్దామని అడిగాను. చేద్దామని ముందుకు వచ్చారు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాను. బాగుంది సినిమాను కూడా కథ, కథనాలు డిఫరెంట్ గా ఉంటాయి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఈ సినిమాలలో మూడు సాంగ్స్, మూడు ఫైట్స్ ఉన్నాయి.. హీరో కిషోర్ తేజ చాలా బాగా చేశారు.. మంచి హార్డ్ వర్కర్ ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా దెబ్బలు తగిలించుకున్నా.. ఎప్పుడు వెనుకడుగు వెయ్యలేదు. హీరోయిన్ భవ్యశ్రీ నాతో చేస్తున్న రెండో సినిమా ఇది. చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుందని అన్నారు.

కో ప్రొడ్యూసర్ డా. మహేంద్రబాబు మాట్లాడుతూ… రామ్ కుమార్ ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పటి వరకు 12 సినిమాలు పూర్తి చేయ‌డం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా కూడా హిట్ అయి మా అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.

హీరో కిశోర్ తేజ మాట్లాడుతూ… డైరెక్టర్ రామ్ కుమార్ చెప్పిన దానికంటే సినిమా చాలా బాగా తీశారు. టీజర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా మా ఆర్టిస్టులకు టెక్నిషియన్స్ కు మంచి పేరు రావాలని, మా నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

హీరోయిన్ భవ్యశ్రీ మాట్లాడుతూ… డైరెక్టర్ రామ్ కుమార్ తో వర్క్ చేస్తున్న రెండో సినిమా. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యాను. సినిమా ఊహించ‌ని విధంగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటివరకు ఇటువంటి కథ రాలేదు అన్నారు. నాకు సహకరించిన కో-ఆర్టిస్ట్ లకు,టెక్నిషియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కథ రచయిత అశోక్, నటులు విజయ్ భాస్కర్, చిట్టిబాబు, మల్లిక్, పలువురు టెక్నిషియన్స్ పాల్గోన్నారు.

సమర్పణ : కట్ట శివ
బ్యానర్ : శ్రీ సాయి ప్రొడక్షన్స్

నటీనటులు : కిషోర్ తేజ (హీరో ), భవ్య శ్రీ (హీరోయిన్ ), శ్రీ రామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్, దేవిశ్రీ, పద్మా జయంతి, పద్మిని, చిట్టిబాబు, మల్లిక్.

నిర్మాత: రాజనేని వెంకటేశ్వర్ రావు
సహా నిర్మాత : డా ..మహేంద్ర బాబు
స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : రామ్ కుమార్
సినిమాటోగ్రఫీ : రాజు శేషన్న కిట్టు
ఎడిటర్ : శివ శర్వాణీ
సంగీతం : హర్ష ప్రవీణ్
డాన్స్ మాస్టర్ : చంద్ర కిరణ్
పీఆర్ఓ : దయ్యాల అశోక్