షూటింగ్ పూర్తి చేసుకున్న “తలకోన”

250


అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “తలకోన” . ఈ చిత్రం ఇటీవలే తలకోనలో షూటింగ్ పూర్తి చేసుకుని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంటూ డబ్బింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విదంగా పాలిటిక్స్ ని కూడా మిక్స్ చేసి చూపించడం జరిగిందని అంతే కాకుండా ప్రకృతికి విరుద్ధంగా వెళితే జరిగే పరిణామాలు కూడా తెలిపే ప్రయత్నం చేసామన్నారు.మెయిన్ కథాంశం ఏమిటంటే, తలకోన ఫారెస్ట్ లోకి హీరోయిన్ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్తుంది..ఎంత మంది వెళ్లారు ఎంతమంది తిరిగొచ్చారు అనేది ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాము.. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ ను కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా రానుంది అని తెలిపారు.

నిర్మాత .దేవర శ్రీధర్ రెడ్డి(చేవెళ్ల) మాట్లాడుతూ… మొదటిసారి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను.. మంచి స్టోరీ కుదిరింది. షూటింగ్ “తలకొనలో అద్భుతంగా జరిగింది. అప్సర రాణి యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వుంటాయి.అన్ని డిపార్టుమెంట్లు మనసు పెట్టి పని చేశారని సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ… మంచి స్క్రిప్ట్ కు నేను ఫ్యాన్ ను. అదే ఇప్పుడు ఈ తలకోన చిత్రం చేయడానికి కారణం అయ్యింది. నా మొదటి సినిమా నుంచి కూడా మంచి కథలనే ఎంచుకుంటాను. అవి నాకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం లో పాటలు కూడా అందరికీ నచ్చుతాయని ముఖ్యంగా టైటిల్ సాంగ్ నా ఫేవరెట్ అని చెప్తూ ఈ చిత్రం మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు.

నటీనటులు: అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, ఉగ్రం మంజు, విజయ్ రంగరాజు, రాజా రాయ్, యోగి కత్రి, కరణ్ విజయ్, డెబోరో, ముస్కాన్, చంద్రిక, అరుణ, లత తదితరులు నటించిన ఈ చిత్రానికి..

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాసి
నిర్మాత: దేవర శ్రీధర్ రెడ్డి(చేవెళ్ల)
సమర్పణ : స్వప్న శ్రీధర్ రెడ్డి
పి ఆర్ ఓ : బాసింశెట్టి వీరబాబు
డిఓపి : మల్లికార్జున్ – EHV ప్రసాద్
మ్యూజిక్ : సుభాష్ ఆనంద్
ఫైట్స్ : వింగ్ చన్ అంజి
ఎడిటింగ్ :ఆవుల వెంకటేష్
కొరియోగ్రఫీ : చార్లీ
కో డైరెక్టర్ & లిరిక్స్ : కర్ణ నాయుడు
ఆర్ట్ : విజయ కృష్ణ
స్టిల్స్: భద్రం
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : పరిటాల రాంబాబు
ఆడియోగ్రఫీ : సాగర్