“అక్షర” మూవీ లోని ‘నీ పేరు ప్రేమ దేశమా” పాట ‘కు మంచి స్పందన

519

టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం అక్షర. బి. చిన్న కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కనులకు కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమ దేశమా” అనే పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ లిరిక‌ల్ టీజ‌ర్ ని చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. `క‌నుల‌ను కాప‌లాగ వుంచా.. నీ పేరు ప్రేమ దేశ‌మా..మ‌న‌సుకు త‌లుపుల‌న్ని తెరిచా.. నీ ప్రేమ‌కింత అంద‌మా..` అంటూ సాగే పాటను గేయ ర‌చ‌యిత బాలాజీ రాయ‌గా అనుదీప్ దేవ్ ఆల‌పించిన‌ ఈ పాట మెలోడియ‌స్‌గా ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌లో ఆర్టిస్టులంద‌రినీ ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిక‌రం. మ‌ధునంద‌న్.. స‌త్య పాత్ర‌ల‌కు ఈ చిత్రంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

బాలాజీ సాహిత్యానికి త‌గ్గ రీతిలో సురేష్ బొబ్బిలి అందించిన స్వ‌రాలు పాట‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. మంచి సాహిత్యం.. సంగీతంల క‌ల‌బోత‌గా వున్న ఈ పాట సినిమాకు ప్లస్‌గా మారే అవ‌కాశం వుంది. ఈ మెలోడీ అక్షర ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న స్పందన వారిలో మరింత ఆనందాన్ని కలిగించింది. . సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి- అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్ర‌మిది. టీజ‌ర్ ఇప్ప‌టికే జ‌నాల్లోకి దూసుకెళ్లింది.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రానికి
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా,
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.