ఇష్క్ ఈజ్ రిస్క్’ ఆడియో విడుదల

709

‘ఈ 2 మనసులు’ చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.చంద్రశేఖర్.. ఆ చిత్రం నిర్మాణంలో వుండగానే, మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. జెయస్సార్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇష్క్ ఈజ్ రిస్క్’. రవిచంద్ర, యుగా యుగేష్, సాయిశ్రీవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కింగ్ దర్శకుడు. జీవా, చమ్మక్‌చంద్ర, తాగుబోతు రమేష్, నల్ల వేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో..

చిత్ర నిర్మాత ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కన్నడ సుపర్ స్టార్ డా . రాజ్ కుమార్ గారు ఒక మాట అంటారు అభిమానులే దేవుళ్ళు అని. అలా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సాధారణంగా ప్రతి ప్రొడ్యూసర్ మా టీమ్అంతా చాలా కష్టపడ్డారు అంటుంటారు. అయితే ఈ సినిమా చూసి మీరే చెప్పాలి నిజంగా ఎవరెవరు ఎంతెంత కష్టపడ్డారు అని. అలాగే నా ఫ్రెండ్ అర్జున్ ఆర్య కన్నడలో మూడు యాక్షన్ సినిమాలు చేసి పాపులర్ అయ్యి నా సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం చూశాక ఎవ్వరు సపోర్ట్ చేసిన చేయకపోయినా మీరందరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు అనే ధైర్యం పెరిగింది” అన్నారు.

హీరో రవిచంద్ర మాట్లాడుతూ – ” ట్రైలర్ తప్పకుండా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దర్శకుడురాజ్‌కింగ్ చాలా చక్కగా తెరక్కించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ‘అన్నారు.

దర్శకుడు రాజ్‌కింగ్ మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. ‘ఇష్క్ ఈజ్ రిస్క్’. చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాత ఎస్.చంద్రశేఖర్‌గారికి థ్యాంక్స్ .‘హాస్యానికి పెద్దపీటవేస్తూ రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్’ ఇష్క్ ఈజ్ రిస్క్. మంచి టీమ్ కుదిరింది. మంచి ఔట్ వచ్చింది. తప్పకుండా అందరికి నచ్చుతుంది “అన్నారు.

రచ్చ రవి మాట్లాడుతూ – ” చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్” అన్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ – ” మంచి అవకాశం. మేమందరం సద్వినియోగ పరచుకున్నాం అనుకుంటున్నాం. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం “అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.