హైదరాబాద్‌లో అక్టోబర్ 15న జరుగనున్న స్టార్ మా సూపర్ సింగర్ ఆడిషన్స్

181

• ఆడిషన్‌లు హైదరాబాద్‌లో అక్టోబర్ 15, 2023న ఉదయం 9:00 గంటలకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో వున్న సారథి స్టూడియోస్‌లో ప్రారంభమవుతాయి.
• మీరు 18-30 సంవత్సరాల వయస్సు గలవారైతే మరియు మీ స్వర ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవాలని కలలుకంటున్నట్లయితే; ఈ అవకాశాన్ని వదులుకోవద్దు
హైదరాబాద్, అక్టోబరు 12, 2023: తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ హంట్‌లలో స్టార్ మా సూపర్ సింగర్ ఒకటి, ఔత్సాహిక గాయకులు మరియు సంగీత ప్రేమికులందరినీ ఇది పిలుస్తోంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ సింగర్ కొత్త సీజన్‌ను స్టార్ మా ప్రారంభిస్తున్నందున మరెక్కడా లేని విధంగా మీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. వేదిక సిద్ధమైంది, స్పాట్ లైట్ నిరీక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుండి వచ్చిన గాత్ర ప్రతిభావంతులు తమ అసాధారణ గాన ప్రతిభను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది!
స్టార్ మా సూపర్ సింగర్, ఈ ప్రాంతంలోని సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన వేదిక, తమ తదుపరి గాన సంచలనాన్ని ఆవిష్కరించడానికి తిరిగి వచ్చింది. అక్టోబర్ 15, 2023న హైదరాబాద్‌లో అమీర్‌పేటలో వున్న సారథి స్టూడియోస్‌లో ఉదయం 9:00 గంటలకు ఆడిషన్స్ ప్రారంభమవుతాయి. మీరు 18-30 సంవత్సరాల వయస్సు గలవారైతే మరియు మీ స్వర ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవాలని కలలుకంటున్నట్లయితే; ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి : కళ్యాణ్ చక్రవర్తి @ 9381340098