‘అరణ్య’ జర్నీలో నేనెంతో నేర్చుకున్నాను.. : హీరో రానా దగ్గుబాటి

603

రానా దగ్గుబాటి హీరోగా విష్ణు విశాల్‌, శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్‌ ముఖ్య పాత్రదారులుగా ప్రముఖ దర్శకుడు ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన చిత్రం అర‌ణ్య‌. ఈరోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మార్చి 26న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మార్చి 3న హైదరాబాద్ పీఆర్‌లో జ‌రిగిన వేడుక‌లో ‘అరణ్య’ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రానా, దర్శకుడు ప్రభు సాల్మన్, హీరోయిన్స్ శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్, నటుడు విష్ణు విశాల్, ఈరోస్ ప్రతినిధి నందు ఆహుజా పాల్గొన్నారు.

హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ళ తరువాత ‘అరణ్య’ సినిమా వస్తుంది. ప్రభు సాల్మన్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో అరణ్య క్యారెక్టర్ ప్లే చేశాను.. ప్రభు సాల్మన్ స్టయిల్ లోనే ఈ చిత్రం ఉంటుంది. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో.. అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లలేం’ అనేది అందరికీ తెలుసు.   చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూపించాలన్న ఉద్దేశంతో ఈరోస్ నిర్మాతలు ఏడాది పాటు వెయిట్ చేసి మార్చి 26న వరల్డ్ వైడ్ గా బిగ్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్లకి నా స్పెషల్ థ్యాంక్స్‌”.. అన్నారు.

దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ.. “ఏనుగులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. కానీ, ఐదేళ్లుగా ఇక్కడ అనేక కారణాల వల్ల ఏడాదికి 700 నుంచి 800 వరకు ఏనుగులు మరణిస్తున్నాయి. దీనికి అడవుల విస్తీర్ణం తగ్గడమూ ఒక కారణం. దీని ఫలితంగానే పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని మనమూ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. రానా ఇందులో ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు.   అన్నారు.

నటుడు విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. “అరణ్యలో సింగా అనే పాత్రలో నటించాను.. కథలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర నాది. రకరకాల వెరీయేషన్స్ ఉంటాయి. అనేక మలుపులతో నా క్యారెక్టర్ రన్ అవుతుంది. రానా నాకు మంచి స్నేహితుడు.. ఆడియెన్స్ అందరికీ ‘అరణ్య’ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది” అన్నారు.

శ్రియ పిల్గావోంక‌ర్‌ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో న్యూస్ రిపోర్టర్ గా నటించాను. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. రానాకు సపోర్ట్ చేస్తూ.. వుండే పాత్ర. ఇంత మంచి బిగ్ పాన్ ఇండియా మూవీలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది” అన్నారు.

జోయా హుస్సేన్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాద్ అమ్మాయిని. ఏనుగులను కాపాడే రానా టీంలో ముఖ్య పాత్ర చేశాను. బిగ్ స్పాన్ ఉన్న ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది” అన్నారు.

ఈరోస్ సంస్థ ప్రతినిధి నందు ఆహుజా మాట్లాడుతూ.. “ప్రభు, రానా కాంబినేషన్లో వస్తోన్న ‘అరణ్య’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న అత్యధిక స్క్రీన్స్ లలో రిలీజ్ చేస్తున్నాం. బిగ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా తెలుగు, హిందీ, తమిళ్ త్రీ లాంగ్వేజెస్ లో నిర్మించాం.. గ్యారెంటీగా ఈ చిత్రం ఆడియెన్స్ కి నచ్చుతుంది” అన్నారు.