పాన్ ఇండియా మూవీలో పవర్ ఫుల్ పాత్రలో హీరో విశ్వ కార్తికేయ

148

విశ్వ కార్తికేయ….తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు, చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి నట సింహం బాలకృష్ణ గారు, బాపు గారు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అలా ఎంతో మంది స్టార్స్ తో వర్క్ చేసిన విశ్వ కార్తికేయ సుమారు 50 కి పైగా చిత్రాలలో బాలనటుడి గా చేసి, నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, స్టేట్ అవార్డు ఫర్ మెరిటోరియస్ అచివేమెంట్ ని అలా ఎన్నో పొందాడు, టాలీవుడ్ నుంచి పెద్దల ప్రశంసలు అందుకున్నాడు మన విశ్వకార్తికేయ.

ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరో గా మారి జైసేన, కళాపోషకులు, ఐపిఎల్, అల్లంతదూరన అనే సినిమాలు థియేటర్స్ లో రిలీస్ అయ్యి డీసెంట్ సక్సెస్ ను అందుకున్నాడు, టాలీవుడ్ పెద్దల నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆడియో మార్కెట్ ని థియేటర్ అండ్ ఓ టి టి మార్కెట్ ని కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు. కథ కి ప్రాధాన్యం ఇస్తూ ముందుకి సాగుతున్నాడు ఈ యువ హీరో.
అయితే ఆ స్పీడ్ సరిపోలేదు అనుకున్నాడా ఏమోగాని గేర్ మార్చి ఇటీవల పాన్ ఇండియన్ సినిమా ఎన్త్ హావర్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ గా భారీ బడ్జెట్ లో అలాగే విజువల్ ఫిస్ట్ గా రూపుదిద్దుకుంటుంది, రాజు గుడిగుంట్ల దీన్ని దర్శక నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు, ఎన్త్ హావర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే ఫిల్మ్ నగర్ లో ఇంకో హాట్ టాపిక్ గా మారిన ఒక విషయం ఏంటీది అంటే ఇటీవల ఒక ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ని ఒకే చేశాడు అని, త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని ఆ మూవీ కోసం తన బాడీ షేప్ ని కూడా ఇంకా ఫిట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. అయితే ఆ సినిమా విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సారి ఎలాగైనా స్టార్ లిస్ట్ లోకి చేరాలని గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు విశ్వ కార్తికేయ. టాలెంట్ ఉన్న హీరో గా ఆల్రెడీ గుర్తించబడ్డ విశ్వ.. కరెక్ట్ కంటెంట్ పడీయితే స్టార్ లిస్ట్ లో చేరడం మాత్రం ఖాయం.