యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న “వోడ్కా గర్ల్స్.. విస్కీ బాయ్స్” టైటిల్ లాంచ్!!

548

వ్యాపార రంగంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టి. మనోజ్ యాదవ్, టి.విజయ్ కుమార్ తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగిడి మొదటి ప్రయత్నంగా భారీ బడ్జెట్ తో ఓ వెబ్ సీరీస్ ని నిర్మిస్తున్నారు… మారీచి మీడియా వర్క్స్ పతాకంపై రాజ యం. యస్.యన్. దర్శకత్వంలో యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న “వోడ్కా గర్ల్స్..విస్కీ బాయ్స్” చిత్రం టైటిల్ ని డిసెంబర్ 25 న ఘనంగా లాంచ్ చేశారు.

నిర్మాత టి.మనోజ్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ టాకీస్ బ్యానర్లో ఎన్నో ఈవెంట్స్, పలు వ్యాపారాలు చేస్తున్న మాకు రాజశేఖర్ రెడ్డి మంచి స్టోరీ చెప్పారు. ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్స్ తో భారీ బడ్జెట్తో వోడ్కా గర్ల్స్..విస్కీ బాయ్స్ వెబ్ సీరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్బంగా టైటిల్ లాంచ్ చేశాం. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మా మిత్రులు విజయకుమార్, సాయినాథ్ గౌడ్ సహకారాలతో ఈ వెబ్ సిరీస్ ని అందరికీ నచ్చేవిధంగా నిర్మిస్తాం.. అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ యం. యస్.యన్. మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి నాడు మా “వోడ్కా గర్ల్స్.. విస్కీ బాయ్స్” వెబ్ సిరీస్ టైటిల్ లాంచ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. మా నిర్మాతలు మనోజ్ యాదవ్, విజయ్ కుమార్, సాయినాథ్ గౌడ్, మరియు వినయ్ కోట్ర , వాస్తవ్ రావు ఎంతో సపోర్ట్ చేసి ఖర్చుకు వెనకాడకుండా బిగ్ బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు.. కంప్లీట్ కమర్షియల్ యూత్ ఎంటర్ టైనర్ ఇది. డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ప్రముఖ నటీనటులని, టెక్నీషియన్స్ ఫిబ్రవరిలో సెలెక్ట్ చేసి మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం.. అన్నారు.

మరో నిర్మాత టి.విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇది మా ఫస్ట్ వెబ్ సిరీస్ మూవీ. రాజశేఖర్ కొత్త కాన్సెప్ట్ చెప్పారు. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. వోడ్కా గర్ల్స్.. విస్కీ బాయ్స్ టైటిల్ చాలా క్రేజీ గా ఉంది. కొంత మంది ఫ్రెండ్స్ సహకారంతో ఈ వెబ్ సిరీస్ చిత్రాన్ని బిగ్ బడ్జెట్లో నిర్మిస్తున్నాం.. అన్నారు.