టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అందిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కావాల్సింది కాగా సెన్సార్ కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ గా మార్చారు. ఈ సందర్భముగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ – ” మా సినిమాను నవంబర్ 29 విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు దాన్ని పొందుపరిచి నవంబర్14వ తారీఖున సెన్సార్ అప్లై చేశాం. అందుకే మేము రిలీజ్ డేట్ కూడా అన్నౌన్స్ చేయడం జరిగింది. కానీ సెన్సార్ వారు ఎలాంటి కారణం చూపకుండా ఇంతవరకూ సినిమా చూడలేదు. ఈ సందర్భముగా నా మనవి ఏంటంటే ముందు సినిమా చూడండి. అన్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – ” అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఏ కులాన్ని కానీ, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం తరువాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. నేను ఎవరినీ టార్గెట్ చేసి సినిమా కాదు కేవలం నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కించాను. మామూలు క్రైమ్ కన్నా.. పొలిటికల్ క్రైమ్ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది అందుకనే ఈ మధ్య ఆ తరహా సినిమాలు నన్ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ముందు ఒక లైన్ వస్తుంది ‘మే 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకూ జరిగిన ఘటనల ఆధారంగా’ అని. జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా జరగబోయే అంశాలను ఊహించి చెప్పడం జరిగింది. సెన్సార్ రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదని, కానీ, అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. అన్నారు.
ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ మాట్లాడుతూ – ” నా ఫస్ట్ మూవీ. పొలిటికల్ సెటైర్ గా తీయడం జరిగింది తప్ప ఎవరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు. అలాగే ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా మీ అందరికీ నచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.
టి.అంజయ్య సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్.