చీమ దోమ మ‌ధ్య‌లో ప్రేమ` ఆడియో లాంచ్‌

554

సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది! అంత వరకు బాగానే ఉంది – మరి అది సాధ్యమా ? ఏం జరుగుతుంది ? అసలు ఆ భావన ఎలా ఉంటుంది ? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే… అది ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా. మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని ఈ రోజు ఆడియోని ఫిలింఛాంబ‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ ” చీమ – ప్రేమ మధ్యలో భామ!” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మా సినిమాకి చీమే క‌థ‌. జ‌గ‌మంతా రామ‌మ‌యం మా సినిమా అంతా చీమ మ‌యం. ఈ సినిమాలోని పాట‌లు అన్నీ చాలా బాగా వ‌చ్చాయి. ఇక్క‌డ‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” మా చిత్రం లో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించాము. రవి వర్మ గారు అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి గార్లు పాడిన పాటలు చాలా బాగున్నాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా చూడ‌వ‌చ్చు. ద‌ర్శకుడు కొత్త‌వారైనా సినిమాని ఎలా చెప్పారో అలానే తెర‌కెక్కించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో డిస్ట్రిబ్యూట‌ర్ బాపినీడు. డిఒపి సింగ‌ర్స్ చిత్ర యూనిట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.