ఇది నా పదేళ్ల కష్టం : ది కిల్లర్ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో కార్తీక్ సాయి
కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా చిన్నా దర్శకత్వంలో శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రం కార్తీక్’స్ ది కిల్లర్. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా తెలంగాణ ప్రొహిబిషన్, అండ్ ఎక్సయిజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జయసుధ తనయుడు నీహాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రైలర్ విడుదల చేయగా, బిగ్ టికెట్ ని హీరో సోహెల్ విడుదల చేసారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ … కార్తీక్ సాయి హీరోగా, డాలీషా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కిల్లర్, నిర్మాతలు రాజు గారు, వాసు దేవరావ్ నిర్మాతలుగా తీస్తున్న సినిమా. తెలంగాణ రాకముందు సినిమా రంగంలో కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉండేది, వాళ్ళు తీసింది సినిమాలు, కానీ తెలంగాణ వచ్చాకా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది సినిమా రంగంలోకి వస్తున్నారు. . ఇక కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని అలాగే అతను హీరోగా మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.
హీరో నీహాల్ మాట్లాడుతూ .. కార్తీక్ చేసిన ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా కార్తీక్ కు మంచి సినిమా అవుతుంది. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయి కార్తీక్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. కార్తీక్ ది థ్రిల్లర్ ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం రాజు అన్న. వాళ్ళబ్బాయి హీరోగా పరిచయం అవుతూ తీస్తున్న సినిమాకు అయన చాలా సపోర్ట్ ఇస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు సినిమా చేస్తామంటే సపోర్ట్ ఇవ్వరు సినిమా విషయంలో ఏ సపోర్ట్ కావాలన్నా నేను అందించేందుకు సిద్ధంగా ఉన్నాను, ఈ టీం అందరికి మరోసారి ఆల్ ది బెస్ట్ అన్నారు.
రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. సినిమా ట్రైలర్ చూసాం.. నిర్మాతగా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారని తెలుస్తుంది. . కాబట్టి దైర్యంగా సినిమా విడుదల చేసుకోవచ్చు.మరోసారి ఈ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత వాసుదేవరావు మాట్లాడుతూ .. ఈ సినిమాకు నాకింత సపోర్ట్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది మా సినిమా అని చెప్పుకోవడం కాదు .. సినిమా చాలా బాగుంటుంది. విడుదల రోజు అందరు టాటూ వేయించుకోవాలి. ఈ సినిమా వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చాలా చెప్పాలి, ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావాలి. ఈ సినిమా గురించి కార్తీ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని కథ, మాటలు, డైరెక్షన్ , హీరో ఇలా అన్ని విధాలుగా చాలా కష్టపడి చేసాడు. ముందు ఆయనకు థాంక్స్ చెప్పాలి. ప్రతి రోజు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అలాగే సతీష్ కూడా చాలా కష్టపడ్డాడు. సినిమా చాలా బాగా తీసాం .. తప్పకుండా ఇది పెద్ద విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉంది, ఈ సినిమా విషయంలో నా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేసారు వాళ్లకు నా థాంక్స్, అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ఇండస్ట్రీ కి చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తుంటారు .. వాళ్లలో ఉన్న ప్యాషన్ చాలా ఉంది .. తప్పకుండ ఈ ఇద్దరు పెద్ద నిర్మాతలు అవుతారు. అలాగే హీరో, దర్శకుడు సాయి గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే సతీష్ గారు కూడా చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ నెల 3 న విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలి, సినిమాను బతికిద్దాం థియేటర్స్ కు వచ్చి చూద్దాం అన్నారు.
హీరో , దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ .. నాకు ఈ రోజు ఈ స్టేజి పై నిలబడి మాట్లాడటానికి పదేళ్లు పట్టింది. నన్ను నమ్మింది మా ఫ్యామిలీ. మనం ఏమి చేస్తున్నాం అని అందరు అడుగుతూనే ఉంటారు.. మీ అబ్బాయి ఏమి చేస్తున్నారు అని.. కానీ మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ పదేళ్లు నేను ఫ్యామిలీ ని మిస్ అయ్యాను. ఇంట్లో భోజనం చేసి ఆరు నెలలైంది. ఫ్యామిలీ ని మిస్ అయింది కేవలం ఈ రోజు కోసం .. నన్ను ఎంకరేజ్ చేసింది మా అమ్మ, నాన్న ఆ తరువాత వాసుగారు .. సొంతోళ్లు ,కూడా నమ్మరు కానీ అయన నన్ను నమ్మరు. సినిమా చాలా బాగా వచ్చింది. కిల్లర్ అంటే ఎదో థ్రిల్లర్ అనుకోకండి… ఇది ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ఎడిటర్, కెమెరా మెన్, అలాగే సతీష్ గారు అలాగే నా టీం అందరు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది .. అలాగే ప్రియా నన్ను అమ్మలా చూసుకుంది. కార్తీక్ సాయి ఇంకా మూడు సినిమాలు చేస్తున్నాడు .. ఆ మూడు సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి .. ఈ సినిమా ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను, ఈ సినిమాకు చిన్నాగారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు .. సినిమాలో చాలా మంది కొత్తవాళ్లు నటించారు. ఇది నా పదేళ్ల కష్టం .. ఇది గుర్తిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. తగ్గేదేలే ! ఈ సినిమా విడుదల రోజు మార్నింగ్ షో అన్ని సెంటర్స్ లో ఫ్రీ .. సినిమా చూడండి పదిమందికి చెప్పండి, అలాగే ఈ వేడుక ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారికి థాంక్స్ అన్నారు.