100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ

602

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవరశాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చాయి. వాటిలో నుంచి 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున అందించనున్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మై లవ్స్ దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అని ట్వీట్ లో పేర్కొన్నారు.

తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు ఇస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ ఏడాది కూడా ఆయన నగదు రూపంలో బహుమతులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 100 మందికి 10 లక్షల రూపాయలు బహుమతిగా పంచుతున్నారు.