తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయన హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `తెల్లవారితే గురువారం`. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా హీరోయిన్ మిషా నారంగ్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు..
నేపథ్యం
మాది హర్యాణాలోని కురుక్షేత్ర. నేను ముంబైలో పెరిగాను. కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇష్టం. ఆ క్రమంలోనే ఆడిషన్స్‌కు వెళ్లాను. `మిస్సింగ్అనే సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యాను. ఆ సినిమా షూటింగ్ లో ఉండగా మేకర్స్ ఫోన్ చేసి ఈ స్టోరీ చెప్పారు. నాకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాను. తెల్లవారితే గురువారం తెలుగులో నేను సైన్ చేసిన రెండవ సినిమా. కాని ఫస్ట్ ఈ సినిమా రిలీజవుతుంది.
ఫన్ లవింగ్ గర్ల్..
దర్శకుడు మణికాంత్ గారు ఈ క్యారెక్టర్ గురించి నరేషన్ ఇవ్వగానే నా పాత్రతో ప్రేమలో పడిపోయా.. అంత మంచి క్యారెక్టర్. యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉంటుంది. ఈ సినిమాలో నేను మధు అనే బబ్లీ అమ్మాయిగా కనిపిస్తాను. నేను ఫన్ లవింగ్ గర్ల్. నా రియల్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉండే పాత్ర. కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్న పాత్ర.
సస్పెన్స్ ఎలిమెంట్స్..
ఈ సినిమాలో మూడు పాటలు మూడు వేరువేరు జోనర్స్‌లో ఉంటాయి. నా ఫేవరేట్ సాంగ్ ఏమైంది.. కాలభైరవ అన్ని పాటలకు మంచి సంగీతాన్నిచ్చారు. తెల్లవారితే గురువారం ఒక వెడ్డింగ్ డ్రామా..ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. దాంతో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. శ్రీసింహ వెరీ సిన్సియర్ అండ్ వెరీ హంబుల్. సెట్లో చాలా కామ్‌గా ఉంటాడు. లాంగ్వేజ్ విషయంలో నాకు చాలాహెల్ప్ చేశారు. మణికాంత్‌గారు ప్రతి సీన్‌ని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా క్లీయర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. దాంతో నాకు యాక్ట్ చేయడం సులభమైంది. ఫస్ట్ డే స్టోరీ చెబుతున్నప్పుడు ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో ఔట్‌పుట్ అలానే అనిపించింది. వారాహి లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం రావడం చాలా హ్యాపీ..
మంచి నటిగా ప్రూవ్ చేసుకోవాలి
నాకు హీరోలలో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. విజయ్ మా సాంగ్ లాంచ్ చేస్తున్నాడు అని చెప్పగానే చాలా థ్రిల్ ఫీలయ్యా.. హీరోయిన్స్‌లలో కాజల్ నటన అంటే ఇష్టం. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అన్ని రకాల పాత్రలు పోషించి నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను.