ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ‘టి. హరీష్ రావు’ సిద్దిపేట లో లాంచ్ చేసారు. ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన ‘ఊకో కాకా’ (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్ ని కూడా హరీష్ రావు ప్రారంభించారు.
‘చిచ్చా’ టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు విడుదల చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ తో కలిసి ‘ఊకో కాకా’ అనే మెన్స్ వేర్ బ్రాండ్ స్టోర్ ని ప్రారంభించడం చాలా ఆనందకరం. అలాగే రాహుల్ సిప్లిగంజ్ హీరోగా ‘చిచ్చా’ చిత్రం యెక్క మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ… చిచ్చా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాహుల్ అభిమానులతో ‘చిచ్చా’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయించారు.
త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్న ఈ చిత్రానికి...
సంగీతం: వెంగి
కెమెరా: రాజ్. కే. నల్లి
ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న
కొరియోగ్రఫీ: శిరీష్
పి.ఆర్.ఓ: వంశీ & శేఖర్
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మల్లిక్ కందుకూరి
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385