కళాభందు డా.టి.సుబ్బరామి రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

521

కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రధానం చేసి సత్కరిస్తారు. గత 20ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖ నటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సంధర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అభినయ మయూరి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, గాయని పి. సుశీల అలాగే మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్,బ్రహ్మానందం లతో పాటు ఈ కార్యక్రమంలో టీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా కళాబంధు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాను అంటే.. ఈ కార్యక్రమాలు టీవీల ద్వారా చూసి అందరూ ఆనందిస్తారని ప్రేక్షకుల ఆనందం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ సంవత్సరం పుట్టిన రోజు నాడు ఇటువంటి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పుట్టినరోజు ఓ పవిత్రమైన రోజు.. అటువంటి రోజు మనం మన జీవితంలో ఏం సాధించాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం.. అనే విషయాలను గుర్తు చేసుకోవాలని అన్నారు.
చివరిగా సన్మాన గ్రహీత సహజ నటి, అభినయ మయూరి జయసుధ మాట్లాడుతూ..’ ప్రతీ సంవత్సరం సుబ్బిరామిరెడ్డి గారు పుట్టినరోజుకు వస్తుంటాం.. కానీ, ఈ సంవత్సరం నన్ను ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వారి మీద ఎంతో గౌరవంతో ఇక్కడికి అనేకమంది వచ్చారని అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.