‘వాల్మీకి’ చిత్రం కూడా 25 వారాలు ఆడాలి- దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

510

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. 1982లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మా’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ పాటను సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గౌరి పాల్గొన్నారు.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ”ముందుగా ఈ పాటక ఇంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణమైన రామానాయుడుగారు, వేటూరి సుందరరామ్మూర్తి, చక్రవర్తిగార్లను తలుచుకుంటున్నాను. ఈ చిత్ర యూనిట్‌ నన్ను ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ”పాటలు, డ్యాన్స్‌ నాకు కంఫర్ట్‌ జోన్‌ కాదు. హరీష్‌గారు ఈ సినిమా కథ చెప్పి ఒక రీమిక్స్‌ సాంగ్‌ ఉంది అన్నారు. నేను మా ఫ్యామిలీలో ఎవరి పాట ఉంటుందో అనుకున్నాను. శోభన్‌బాబు, శ్రీదేవిగారి పాట అనగానే చాలా ఎగ్జయిట్‌గా అన్పించింది. చాలాసార్లు మా నానమ్మ, నాన్నగారు ఈ పాట వింటం నేను చూశాను. అదే పాటను అంతే అమేజింగ్‌గా రీక్రియేట్‌ చేయడానికి హెల్ప్‌ చేసిన ప్రతి ఒక్కరికీ బిగ్‌ థాంక్స్‌.