సెప్టెంబర్ రెండోవారంలో గ్రాండ్ గా ‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్

520

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దేశభక్తి గీతం ‘ఎన్నో తారల సంగమం… అంబరం ఒకటే…’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, ‘చెరుకు ముక్కలాంటి…’ పాట మాస్ ప్రేక్షకులను మెప్పించింది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్, ట్రయిలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.