ఏక్ మినీ క‌థ ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న‌

777

అమెజాన్ ప్రైమ్ వీడియో స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఏక్ మినీ క‌థ మే 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ప‌ద్ధ‌తిలో విడుద‌ల అవుతున్న సంగతి తెలిసిందే. బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు.. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే మా సినిమాను మే 27న విడుదల అమెజాన్ లో విడుద‌ల‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏక్ మినీ క‌థ ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేశారు. యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్ టైనర్ గా ఏక్ మినీ క‌థ ఆడియెన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది. దీనికి త‌గ్గ‌ట్లుగానే ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలు రెడీ చేసి విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటూ అంత‌టా అనూహ్య స్పంద‌న అందుకుంటోంది.

ముఖ్యంగా ట్రైల‌ర్ లో క‌మీడియ‌న్ సుద‌ర్శన్ చెప్పిన పంచ్ డైలాగ్ లు, హీరో సంతోష్ ప‌లికించిన హావ‌భావాలు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ఏక్ మినీ కథ యూనిట్.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య
PRO: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్