డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా “డిస్కోరాజా” గ్రాండ్ రిలీజ్

505

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలానే సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తల్లూరి ప్రకటించారు. మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ… ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు, ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాస్ రాజా రవితేజ ఫాన్స్ కి మంచి కిక్ ఇచేలా ఉంది అని భావిస్తున్నాను, ఈ లుక్ కి వంద రెట్లు కిక్ ఇచ్చే విధంగా ఫుల్ మాస్ అండ్ క్లాస్ ఎంటెర్టైనెర్ గా డిస్కోరాజా ని రెడీ చేస్తున్నారు మా దర్శకుడు వి ఐ ఆనంద్. ఇక మా బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. పాయల్ రాజ్ పుత్, ఫేమ్ నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు అని అన్నారు.

న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు