ఫ్యాంటీసీ థ్రిల్ల‌ర్ “సురాపానం”

1983

హీరోయిన్లుః సంప‌త్ కుమార్‌, ప్రగ్య న‌య‌న్‌

మిగ‌తా పాత్ర‌లుః అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్ , మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజి బాబు, మాస్టర్ అఖిల్ తదితరులు
సంగీతంః భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్
ఎడిటర్: జేపీ
మాటలు: రాజేంద్రప్రసాద్ చిరుత
సాహిత్యం: సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్,
నిర్మాత: మట్ట మధు యాదవ్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ కుమార్

ఇటీవ‌ల కాలంలో టైటిల్ తో పాటు పాట‌లు, ట్రైల‌ర్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న చిత్రం సురాపానం. ఫ్యాంటీసీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ కిక్ అండ్ ఫ‌న్ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. కొత్త‌, పాత న‌టీనటులు న‌టించిన ఈ చిత్రం థియేట‌ర్ లో ప్రేక్ష‌కులను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూద్దాం పదండి…

క‌థ‌: ఒక ప‌ల్లెటూరిలో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసుకుంటూ బ‌తికే శివ(సంపత్ కుమార్) అండ్ బ్యాచ్ కి మ‌ల్ల‌న్న(అజయ్ ఘోష్) అనే విల‌న్ ఒక పెద్ద డీల్ అప్ప‌గిస్తాడు. అదేంటంటే… ఒక మైన్ త‌వ్వుతుండ‌గా బ‌య‌ట‌ప‌డ్డ పురాత‌మైన శివుని విగ్ర‌హం కొట్టేసి ప‌ట్టుక‌రావ‌డం. ఆ ఊరి పోలీస్ అండ‌ర్ లో ఉన్న శివుని విగ్ర‌హం బాక్స్ ని హీరో బ్యాచ్ కొట్టేస్తారు. అందులో శివుని విగ్ర‌హంతో పాటు ఒక చిన్న బాటిల్ దొరుకుంతుంది హీరోకి. అందులో ఉన్న పానీయాన్ని తాగేస్తాడు. అది తాగిన ద‌గ్గ‌ర నుంచి ఒకే రోజులో బాల్యం, య‌వ్వ‌నం, వృద్ధాప్యం ఇలా మూడు ద‌శ‌లు పొందుతుంటాడు. ఇంత‌లో ప‌లు కార‌ణాల వ‌ల్ల శివుని విగ్ర‌హం మిస్ అవుతుంది. ఒక‌వైపు విల‌న్ బ్యాచ్ హీరో కోసం వెతుకుతుంటారు. మ‌రో వైపు హీరో త‌న స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అస‌లు ఆ బాటిల్ ఉన్న పానీయం ఏంటి? శివుని విగ్ర‌హం స్టోరి ఏంటి? చివ‌ర‌కు హీరో మామూలు మ‌నిషి ఎలా అయ్యాడు? త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నాడు అన్న‌ది మిగ‌తా కథ.

కథ… కథనం విశ్లేష‌ణ: మంచి కథ.. స్క్రీన్ ప్లే తో ఫాంటసీ థ్రిల్లర్ మూవీలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు.. రొటీన్ జానార్లతో విసిగిపోయిన ప్రేక్షకులు… కాస్త వైవిధ్యమైన సినిమాలకి బాగా కనెక్ట్ అవుతారు. తాజాగా తెరకెక్కిన సురాపానం చిత్రం కూడా ఇలాంటి వైవిధ్యమైన కథ… కథనాలతో తెరకెక్కిందే..ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కథనం నడిపించే విషయంలో కాస్త స్లో అనిపించినా… ఓవరాల్ గా ఎంగేజింగ్ వుంది. ద‌ర్శ‌కుడు తొలి చిత్రంతోనే స‌క్సెస్ అయ్యాడు. త‌ను రాసుకున్న‌హీరో పాత్ర‌కు న్యాయం చేశాడు. హీరోగా ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. సురాపానం తీసుకోవ‌డం వ‌ల్ల మూడు ద‌శ‌లు పొంద‌డం, విగ్ర‌హం మిస్ అవ‌డం, మ‌ళ్లీ త‌ను ఆ విగ్ర‌హాన్ని క‌నిపెట్టి త‌న స‌మ‌స్య‌ను పోగొట్టుకోవ‌డం ఇవ‌న్నీ కూడా సినిమాకు ఇంట్ర‌స్టింగ్ పాయింట్స్. అలాగే నాట‌కం బాగా వేస్తేనే త‌న కూతురిని ఇస్తాను అంటూ హీరో మామ కండీష‌న్ పెట్ట‌డం…నాట‌కం వేయ‌డంలో ఫెయిల్ అవ‌డం, అందులో ఫిష్ వెంక‌ట్ సంభాష‌ణ‌లు ఇవ‌న్నీ మంచి ఎంట‌ర్‌టైన్‌ చేస్తాయి. ఫిష్ వెంక‌ట్ డైలాగ్స్ థియేట‌ర్లో బాగా పేలాయి. ఫ‌స్టాఫ్ అంతా హీరో బ్యాచ్ చేసే హంగామా, సెకండాఫ్ విగ్ర‌హాన్ని వెత‌క‌డంలాంటి స‌న్నివేశాలు ఇంట్ర‌స్టింగ్ గా ఉంటాయి. మ‌ద‌ర్ సెంటిమెంట్, నాట‌కం వేయ‌డం లాంటివి క‌థ‌ని కొంత డీవియేట్ చేసినా… ఆ స‌న్నివేశాలు బోర్ మాత్రం అనిపించ‌వు. మంచి పాట‌ల‌తో, మంచి ఫ‌న్‌తో ఫ్యామిలీ అంతా క‌లిసి హ్యాపీగా చూసే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్… ఈ ఫాంటసీ థ్రిల్లర్ సురాపానం… గో అండ్ వాచ్ ఇట్.

న‌టీన‌టుల గురించి…
చిన్న‌ చిన్న దొంగ‌త‌నాలు చేసుకునే నార్మ‌ల్ కుర్రాడిగా హీరో సంప‌త్ కుమార్ ఒదిగిపోయాడు. ల‌వ‌ర్ బాయ్ గా కూడా ఆక‌ట్టుకున్నాడు. మూడు ద‌శ‌లు పొందే క్ర‌మంలో త‌న ప‌ర్ఫార్మెన్స్, మ‌ద‌ర్ అండ్ స‌న్ కి మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌నల్ సీన్స్ బాగా పండించాడు. వీటిన్నిటితో పాటు ప‌ర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ఆల్ రౌండ‌ర్ అనిపించుకున్నాడు. అలాగే హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో మీసాల ల‌క్ష్మ‌ణ్ త‌న‌దైన శైలిలో మెప్పించాడు. కొత్త‌గా ప‌రిచ‌య‌మైన కుర్రాడు విద్యాసాగ‌ర్ ఇంగ్లీష్ సినిమాల్లో చెప్పే డ‌బ్బింగ్ మాదిరి డైలాగ్స్ చెబుతూ మంచి హాస్యాన్ని పండించాడు. త‌న‌లో మంచి ఈజ్ ఉంది. ఇక కిక్ అండ్ ఫ‌న్ అని ట్యాగ్ లైన్ పెట్టిన‌ట్టుగా ఫిష్ వెంక‌ట్ తెలంగాణ స్లాంగ్ లో వేసే పంచులు, చేసే కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక విల‌నిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ కామెడీ పండించే పాత్ర‌లో అజ‌య్ ఘోష్ మంచి జోష్ చూపించాడు. త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెబితే ఇంకా బావుండేది. ఇక హీరోయిన్ పాత్ర‌లో త‌న అందంతో , అభిన‌యంతో ప్ర‌గ్య న‌య‌న్ ఆక‌ట్టుకుంది. సీనియ‌ర్ న‌టుడు సూర్య ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో మెప్పించాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు…
ముందుగా డైర‌క్ట‌ర్ రాసుకున్న క‌థ గురించి ప్ర‌స్తావించాలి. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా అద్భుత‌మైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కొత్త డైర‌క్ట‌ర్ అయినా దాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేశాడు. ఇక తెలంగాణ స్లాంగ్ లో రైట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ రాసిన ఫ‌న్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. చిన్న చిన్న డైలాగ్స్ తో మంచి పంచులు పేల్చాడు రైట‌ర్‌. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. జేపీ త‌న‌ ఎడిటింగ్ తో సినిమా వేగాన్ని పెంచుతూ ఎక్క‌డా బోర్ లేకుండా చేశాడు. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన మూడు పాట‌లు కూడా ఆక‌ట్టుకున్నాయి. నేప‌థ్య సంగీతంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ఇక నిర్మాత ఎక్క‌డా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమాని నిర్మించారు.

రేటింగ్: 3/5