HomeTelugu"సర్వం సిద్దం" సినిమా టీజర్ లాంఛ్ లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ

“సర్వం సిద్దం” సినిమా టీజర్ లాంఛ్ లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ

గోవింద్ రాజ్, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్ మెడసాని, పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య, ప్రధాన పాత్రదారులుగా సినేటెరియా మీడియా వర్క్స్ పతాకంపై అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించిన ఔట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “సర్వం సిద్ధం”. (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్ లైన్). ఈ చిత్రం ప్రీ రిలేజ్ కార్యక్రమం మార్చ్ 26న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొనగా మెట్రో టివి జేపీ, సినేటెరియా మీడియా వర్క్స్ వెంకట్ బులేమోని, దర్శకుడు రాబిన్ నాయుడు, నటులు గోవింద్ రాజ్, సంతోష్, సిద్దేశ్వర్ నిర్మాత శ్రీలత బి.వెంకట్, నిర్మాతలు ఎన్.ఆర్ రెడ్డి, అరవింద్, కెమెరామెన్ సంతోష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు..అనంతరం చిత్ర టీజర్ ను బెల్లంకొండ సురేష్ లాంఛ్ చేశారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. సర్వం సిద్దం చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కామెడీతో నవ్విస్తుంది. వెరైటీ కామెడీ జానర్ లో, సినిమా పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమాలోని కామెడీని చాలా బాగా తెరకెక్కించారు, అలాగే ఈ చిత్రం టీజర్ లో ఉన్న రోమాంటిక్ టచ్ చాలా బాగుంది.. ఈ చిత్ర ట్యాగ్ లైన్ “నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత” కామెడీ పతాక స్థాయిని తెలియజేస్తోందని అన్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించాయనీ, అలాగే ఈ చిత్రం కూడా సినిమా నిర్మాణంలో దర్శకుల శైలిని హాస్యకోణంలో చూయిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకలోకం ఆదరించాలని బెల్లంకొండ సురేష్ విజ్ఞప్తి చేశారు.

దర్శక నిర్మాత ఎన్.ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్లోని ఒక్క డైలాగే చిత్రంలో ఉన్న పుష్కలమైన హాస్యం ప్రేక్షకులకు నవ్వించడానికి సిద్దంగా ఉందని తెలియజేస్తోందని అన్నారు.

సినెటేరియా సీఈవో వెంకట్ బులెమోని మాట్లాడుతూ.. వెరైటీతో కూడిన చక్కని కామెడీ 90 నిమిషాలపాటు నాన్ స్టాప్ కామెడీగా అలరిస్తుందని తెలిపారు. సెన్సార్ కమిటీ వారు చిత్రాన్ని చూసిన తరువాత దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించి, గత సంవత్సరం న్నర కాలంగా ఇంతటి కామెడీ మేమే చిత్రంలోనూ చూడలేదనీ, మీరు నవ్వించిన నవ్వులకు మా మనసంతా తేలికై.. స్ట్రెస్ తగ్గి చాలా హాయిగా ఫీల్ అవుతున్నామని చెప్పారని తెలిపారు.

చిత్ర దర్శకులు రాబిన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి కామెడీతో కూడుకున్నదనీ, టెక్నీషియన్లు, నటీనటులు చక్కగా సహకరించి మంచి కామెడీని మీకు అందించ్డంలో తమ చేయూతనందించారు. నిర్మాత శ్రీలత గారు బడ్జెట్ కి వెనకాడకుండా గుడ్ క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు.. బొబ్బిలి సంతోష్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. వెంకట్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.. అన్నారు

నటుడు గోవింద్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక డైరెక్టర్ పాత్రలో నటించాను. సినిమా అంతా ఆధ్యతం కామెడీతో నవ్విస్తుంది. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన వెంకట్ గారికి, రాబిన్ కి నా థాంక్స్ అన్నారు..

గోవింద్ రాజ్, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, మందార్, పూజ, అనుపమ పట్నాయక్, కిరణ్ మెడసాని, త్రిశాంక్, అభిషేక్, రామ్ రోమియో, లావణ్య, యస్వంత్, వెంకటేష్, చరణ్, ఫరీనా, శిరీష, అర్జున్, మధుశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి డివోపి; బొబ్బిలి సంతోష్ రెడ్డి, మ్యూజిక్; డేవిడ్ జి, ఎడిటర్; కిరణ్ రెడ్డి యం, నిర్మాత; శ్రీలత బి. వెంకట్, రచన-దర్శకత్వం; అతిమళ్ల రాబిన్ నాయుడు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES