‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ

196

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు కానుంది. వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయవంతంగా జరిగిన వేడుకకు నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకుడు బాబీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రవితేజ, శరత్ మండవ, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్, సామ్ సిఎస్, సత్యన్ సూర్యన్, ప్రవీణ్ , కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ రవితేజ మాట్లాడుతూ.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. కూల్, పాజిటివ్ పర్శన్. అలాంటి వారితో ఎన్ని సినిమాలైన చేయడానికి నేను రెడీ. ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్ మాస్టర్ స్టంట్ శివ, కెవిన్ సూపర్ గా యాక్షన్ డిజైన్ చేశారు. జులై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ థియేటర్ కి వస్తుంది, అంతా థియేటర్ లో కలుద్దాం” అన్నారు.

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. రవితేజ గారు చిరంజీవి గారిని ఇన్స్ ప్రేషన్ గా తీసుకున్నారు. మేము కెరీర్ మొదలుపెట్టినపుడు రవితేజ గారు మాకు ఇన్స్ ప్రేషన్. చిరంజీవి గారి కార్వాన్ లోకి రవితేజ గారు ఎంటర్ అవ్వడం చూసినపుడు.. రవితేజ కార్వాన్ లోకి త్వరలోనే నేను ఎంటరవ్వాలనిపించింది. ర ఈ సినిమా అన్నీ ఎలిమెంట్స్ వున్న కాంబినేషన్ అనిపిస్తుంది. వేణు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టడం ఆనందంగా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇరవై ఏళ్ల నుండి రవితేజ ఆన్ డ్యూటీ. 29 నుండి రామారావు ఆన్ డ్యూటీ” అన్నారు.