విష్ణు ప్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `చెక్‌మేట్‌`..ఏప్రిల్‌11న విడుద‌ల‌…

464

 

సందీప్‌బొలినేని,విష్ణుప్రియ,దీక్షా పంత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీ చెక్‌మేట్‌. సూటిగా సొళ్లు లేకుండా అనేది ట్యాగ్‌లైన్‌. చిన్ని కృష్ణ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్ర‌సాద్ వేలంప‌ల్లి ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందుతోంది. రాజేంద్ర ప్రసాద్‌, బ్ర‌హ్మానందం, కృష్ణ భ‌గ‌వాన్‌, సంపూర్ణేష్‌ బాబు, శ‌క‌ల‌క శంక‌ర్, సుధీర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌రుడ‌వేగ చిత్రానికి ప‌నిచేసిన అంజి ఈ మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాగ‌ర్ మ‌హ‌తి నేపథ్య సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్‌11న గ్రాండ్ గా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌క‌నిర్మాత ప్ర‌సాద్ వేలంప‌ల్లి మాట్లాడుతూ – “ మాములుగా ప్ర‌తి ప్రేమ‌క‌థ‌లో వారి కుటుంభ స‌భ్యుల నుండి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ఈ సినిమాలో త‌మ ప్రేమ‌కు త‌న క్లోజ్ ఫ్రెండ్‌తోనే స‌మ‌స్య ఏర్ప‌డితే జ‌రిగే ప‌రిణామాలేంటి?..ఆ అమ్మాయి స్నేహితురాలి నుండి త‌న ప్రేమికుడిని ఎలా కాపాడుకుని త‌మ ప్రేమ‌ని గెలిపించుకుంది అనేది క‌థాంశం. బ‌ల‌మైన పాత్ర కావ‌డంతో తెలుగు అమ్మాయి చేస్తే బాగుంటుంది అని విష్ణు ప్రియ‌ని సెల‌క్ట్ చేశాం. త‌న ఫ్రెండ్‌గా దీక్షా పంత్ న‌టిస్తోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఏప్రిల్‌11న రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

తారాగ‌ణంః
సందీప్‌బొలినేని, విష్ణుప్రియ‌, దీక్షా పంత్, రాజేంద్ర ప్రసాద్‌, బ్ర‌హ్మానందం, కృష్ణ భ‌గ‌వాన్‌, సంపూర్ణేష్‌ బాబు, శ‌క‌ల‌క శంక‌ర్, సుధీర్ తదిత‌రులు

సాంకేతిక నిపుణులుః
బేన‌ర్‌: చిన్ని కృష్ణ ప్రొడ‌క్ష‌న్స్
సంగీతం, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం : ప్ర‌సాద్ వేలంప‌ల్లి
సినిమాటోగ్రాఫ‌ర్‌: అంజి (గ‌రుడ‌వేగ ఫేమ్‌)
నేప‌థ్య సంగీతం: సాగ‌ర్ మ‌హ‌తి
సింగ‌ర్స్‌: హేమ‌చంద్ర‌, సింహ‌,
లిరిక్స్‌: ర‌హ‌మాన్‌
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385