HomeTeluguప్రతిరోజూ పండగే సినిమా గురించి సత్యరాజ్ స్పెషల్ ఇంటర్వ్యూ...

ప్రతిరోజూ పండగే సినిమా గురించి సత్యరాజ్ స్పెషల్ ఇంటర్వ్యూ…

సాయితేజ్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయిక. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు మారుతీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ చిత్రలో ముఖ్య పాత్రలో కనిపించిన సత్యరాజ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ…

డైరెక్టర్ మారుతి నాకు ఈ కథ చెప్పగానే నచ్చింది. నేను సినిమాలు అరుదుగా ఒప్పుకుంటాను, చిత్రంలో నా పాత్రకు ప్రాధాన్యతను చూసుకుంటాను. తెలుగులో నేను ఇప్పటివరకు చేసిన రోల్స్ అన్ని నాకు మంచి గుర్తింపును తెచ్చాయి.

ప్రతిరోజు పండగే సినిమాలో నా పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సాయి తేజ్ తో నేను చేసిన సీన్స్ అన్ని బాగున్నాయని ఆడియన్స్ అంటున్నారు. మారుతి ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ ను ఎంటర్టైనింగ్ వేలో చెప్పడంలో సక్సెస్ అయ్యాడు, అది ధియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తోంది.

ఈ సినిమాకు అన్ని కుదిరాయి, గీతా ఆర్ట్స్, యూవీ మేకింగ్, సాయి తేజ్ స్క్రీన్ ప్రజెన్స్, మారుతి డైరెక్షన్, తమన్ మ్యూజిక్ ఇలా అన్ని సినిమాకు మెయిన్ అసెట్ అయ్యాయి కావునే సినిమా గ్రాండ్ గా ఉంది. వీటన్నింటికి తోడు ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అయ్యి బాగా రిసీవ్ చేసుకున్నారు.

యువి బ్యానర్ లో మిర్చి చేశాను, అప్పటినుండి ప్రభాస్ బాగా ఫ్రెండ్ అయ్యాడు, ఆ తరువాత బాహుబలిలో మళ్ళీ కలిసి చేశాం. నేను ఇప్పుడు మళ్లీ యువి బ్యానర్ లో ప్రతిరోజు పండగే సినిమాకు వైర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. భవిషత్తులో యువి, గీతా ఆర్ట్స్ లో మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని ఉంది.–

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES