స్ట‌న్నింగ్ “సాహో ” పోస్ట‌ర్ ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్

499

‘బాహుబలి చిత్రం తరువాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది. అస‌లు ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి తిరిగింది. ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో మూవీ గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ వారి అల‌రిస్తున్నాడు. ఈరోజు స్ట‌న్నింగ్ రొమాంటిక్ పోస్ట‌ర్ ని పోస్ట్ చేశాడు. అగ‌ష్టు 30 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అనే సందేశం తో హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ కి నెటిజ‌న్ లు ఫిదా అయిపోయారు. ఇక డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.. ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మెష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేది లోపు సాహో లు వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియ‌జేస్తాం అని యూనిట్ స‌బ్యులు అంటున్నారు.ఈ చిత్రం ఇండియాలో మెట్ట‌మెద‌టిగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబందించి మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేశారు. రెండ‌వ సింగిల్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నారు.