“ప్ర‌తిరోజు పండ‌గ” సెట్ లో సాయితేజ్ రాశిఖ‌న్నా సెల్ఫి

555

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా…. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా “ప్రతిరోజు పండగే చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని షూటింగ్ కి విళ్ళిన విష‌యం తెలిసిందే.. ఈ సినిమా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ని ఎనౌన్స్ చేయ‌గానే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కొన్ని ప్రాజెక్ట్ కి అంతే అన్ని అలా క‌ల‌సివ‌స్తోంది. ఈ చిత్రం లో సాయితేజ్‌, రాశిఖ‌న్నా లు జంట‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ ఇంత‌కు ముందు సుప్రీమ్ లాంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ లో చేశారు. అలాగే ఈ బ్యాన‌ర్ పై మారుతి కాంబినేష‌న్ లో వ‌చ్చిన భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ వ‌చ్చింది. ఇప్ప‌డు వీరంతా ఓకే సెట్ పై వుంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాక ఇంకేమిటి ప్ర‌తిరోజు పండ‌గే అనే టైటిల్ జ‌స్టిఫికేష‌న్ లా షూటింగ్ జ‌రుగుతుంది. సుప్రీమ్ హీరో సాయితేజ్‌, రాశిఖ‌న్నా లు క‌లిసి వున్న సెల్ఫి పిక్ ని హీరోయిన్ రాశిఖ‌న్నా ట్వీట్ చేయ‌టం మెగా అభిమానుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఫ్యాన్స్ కూడా పండ‌గ చేసుకున్నారు..

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కొసం సిద్ధ‌మ‌వుతున్నారు.

నటీనటులు ;సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జైకుమార్ సంపత్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను