కే ఎల్ యూనివర్సిటీ విద్యార్థుల చేతులు మీదుగా విడుదలైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “గని” చిత్రంలో మూడవ పాట

242


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాట విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. విజయవాడ KL యూనివర్సిటీలో ఈ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్ మిగిలిన చిత్ర యూనిట్ హాజరయ్యారు. అక్కడ కాలేజీ అమ్మాయిల చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని త్వరలోనే విడుదల కానుంది. ఈ మధ్యే హీరో వరుణ్ తేజ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు బాబీ మాట్లాడుతూ.. ‘ గని సినిమా అనుకున్న దాని కంటే అద్భుతంగా వచ్చింది. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించాడు. మొదటి పాట విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ప్రత్యేకంగా తమన్ కు ఫోన్ చేసి మరీ ఈ విషయం చెప్పాను. ఈ రోజు ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థినుల చేతుల మీదుగా మా పాట విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. గని సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుక ఉంటుంది..’ అని తెలిపారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ‘ ఈ పాట నేను ఎప్పుడో ట్యూన్ చేసి పెట్టుకున్నాను. గని సినిమాకు అది అనుకోకుండా కుదిరింది. అదితి శంకర్ తోనే ఈ పాట పాడించాలని ముందునుంచి అనుకున్నాను. నేను ఊహించిన దానికంటే అది ఇంకా అద్భుతంగా పాడింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది..’ అని తెలిపారు.

నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను

Eluru Sreenu
P.R.O