నాని, శివ నిర్వాణ‌, ‘ట‌క్ జ‌గ‌దీష్‌’లో లిరిక‌ల్ వీడియో సాంగ్ ఫిబ్ర‌వ‌రి 13న విడుద‌ల‌

448

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న నాయిక‌లుగా రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌. త‌మ‌న్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ఎస్సెట్‌. ఆయ‌న సుమ‌ధుర స్వ‌రాలు కూర్చిన “ఇంకోసారి ఇంకోసారి” అనే పాట లిరిక‌ల్ వీడియోను ఫిబ్ర‌వ‌రి 13 ఉద‌యం 9 గంట‌ల‌కు లాంచ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ పాట‌‌ను చిత్రంలో నాని, రీతు వ‌ర్మ జంట‌పై చిత్రీక‌రించారు.

ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పోస్ట‌ర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైర‌ల్ అయ్యింది.

ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ర‌చ‌న కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385