బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన‌ “బజారురౌడీ” మోషన్ పోస్టర్ విడుదల!

304

హృద‌య‌ కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి విచిత్ర‌మైన టైటిల్స్ లో విభిన్న‌మైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఎవ‌డ‌బ్బ‌సోత్తు కాదు అని ప్రూవ్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న చిత్రం బ‌జారురౌడి. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు సీనియర్ నటుడు నాగినీడు, షియాజి షిండే, పృథ్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ
చాలా రోజుల తరువాత నేను ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇలా మాట్లాడ్డం సంతోషం. నాలుగు సినిమాల్లో నటించాను, ఇది నా ఐదో సినిమా. నా ప్రతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సక్సెస్ చేస్తారని ఆసుస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ
ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించాము. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలుసుకుని 150 రూపాయిలు పెట్టి టికెట్ కొని వ‌చ్చే ప్రేక్ష‌కుడ్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా సినిమా ఉంటుంది. మంచి కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బజారురౌడీ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ
మా బజారురౌడీ సినిమా బాగా వచ్చింది. సంపూర్ణేష్ బాబు గారు ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించారు. కరాటే కల్యాణి, పృద్వి గారు, నాగినీడు ఇలా అందరూ మా సినిమాలో మంచి పాత్రల్లో నటించారు. విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని తెలుపుతున్నాను అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి మాట్లాడుతూ.. అంద‌రూ ఈ సినిమాకి మాట తీయ‌కుండా ప‌నిచేశారు. సంపూర్టేష్ బాబు ఈ సినిమా లో చాలా వేరియేష‌న్స్ వున్న పాత్ర చేస్తున్నాడు. షియాజి షిండే గారు, నాగినీడు గారు, పృధ్వి గారు, స‌మీర్ గారు, కరాటే క‌ళ్యాణి గారు ఇలా చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులు న‌టించారు. ఈ మెష‌న్ పోస్టర్ చూస్తే మా సినిమా ఏలా వుంటుందో అంద‌రికి తెలుస్తుంది. మ‌రిన్ని విష‌యాలు సినిమా విడుద‌ల కి ముందుగా మాట్లాడుతాను. అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వి, షియాజి షిండే, నాగినీడు, కరాటే కల్యాణి మాట్లాడుతూ… బజారురౌడీ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా సంపూర్ణేష్ బాబుకు మరో మంచి సినిమా అవుతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది తెలిపారు.

న‌టీ న‌టులు..
బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు
నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు
మాట‌లు: మ‌రుధూరి రాజా
సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌
సంగీతం: సాయి కార్తిక్‌
ఎడిటర్: గౌతం రాజు
ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా
కాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌
మేక‌ప్‌: శ్రీకాంత్‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి
కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌

  • Eluru Sreenu
    P.R.O