`భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

473

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమాను ముందుగా చిన్న కాన్సెప్ట్‌గానే స్టార్ట్ చేశాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ముందు ఈ సినిమాకు నిర్మాత‌గా మాత్ర‌మే సినిమా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ వేరే డైరెక్ట‌ర్‌ను పెట్టినా ఆయన వెన‌క ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. దీంతో నేనే డైరెక్ట్ చేశాను. ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక అలా తీరింది. సినిమా చూసిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు స‌హా కొంత‌మంది చిన్న చిన్న క‌రెక్ష‌న్స్ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమాను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేస్తున్నాం. జౌట్ అండ్ ఔట్ కామెడీ. 1గంట 53 నిమిషాలున్న మా సినిమాలో గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతారు. అన్నారు.

నిర్మాత ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ – “శ్రీనివాస‌రెడ్డిగారితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రిచ‌యం ఎర్ప‌డిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌యాణం బావుంది. ఈ సినిమా విష‌యంలో ఆయ‌న కేవ‌లం భాగ్య‌న‌గ‌ర వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ గ‌మ్మ‌త్తు చేస్తార‌న‌డంలో సందేహం లేదు. గ‌ట్టిగా న‌వ్విస్తున్నారు. చాలా క్లారిటీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్రం శ్రీను, ప్రవీణ్‌, అశోక్ త‌దిరులు పాల్గొన్నారు.