*”మీకు మాత్రమే చెప్తా” సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు – నిర్మాత విజయ్ దేవరకొండ*

822

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకులు షామీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం నవంబర్ 1న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ.

*మీరు చేయాల్సిన సినిమాకు మీరే నిర్మాత అయ్యారా?*

నేను పెళ్లి చూపులు సినిమా చేశాక, మొదటిసారి ఈ సినిమా డైరెక్టర్, కో- డైరెక్టర్ షామీర్ అండ్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకుండా చాలా రిచ్‌గా వాటిని తీశారు. యాక్టర్ అయినా, నిర్మాత అయినా, దర్శకులు అయా వాళ్ల స్కిల్ చూసి, వెంటనే వాళ్లతో సినిమా చేస్తానని అయ్యా. ఆ తరువాత వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ చెప్పారు. నేను చేద్దాం అన్నాను. అయితే అర్జున్ రెడ్డి సినిమా అప్పటికి రిలీజ్ కాలేదు. అది రిలీజ్ అయ్యాక తర్వాత నా సినిమాలు వచ్చాక ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ, సినిమా అయితే చేయాలి అనుకున్నాను. అలా చివరికి నేను నిర్మాతగా మారి సినిమా తీశాను.

*తరుణ్ భాస్కర్ నే ఎందుకు హీరోగా పెట్టుకున్నారు ?*

తరుణ్ భాస్కర్ అయితే మాత్రమే ఈ సినిమా టైమింగ్ చాల బాగుంటుంది. తరుణ్ పెళ్లి చూపులు సినిమా చేస్తున్నప్పుడే సీన్స్ లో యాక్ట్ చేసి చూపించేవాడు. నిజంగా మాకంటే బాగా చేసేవాడు. తరుణ్ అయితేనే ఈ స్క్రిప్ట్ కి బాగుంటుందని తనని అడిగాను. అప్పుడు తను ఒప్పుకోలేదు. అయితే చివరికి ఒప్పుకున్నాడు.

*మీరే నిర్మాత ఎందుకు అయ్యారు? మీరు అడిగితే ఎవరైనా తీస్తారు కదా?*

పెళ్లి చూపులు అప్పుడు నిర్మాత దొరకకపోవడం ఎంత కష్టం అనేది చూశా.. అందుకే సినిమాని నిర్మించా. ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది అందుకే ఇప్పుడు నేను ఉన్న స్టేజ్‌లో ఎవరికైనా సపోర్ట్ చేయాలని ఇది చేశాను. ఎంతవరకు చేయవచ్చో అంతవరకు చేయాలని నిర్ణయించుకుని చేశాను.

*నిర్మాతగా సినిమాలో ఎంతవరకు ఇన్ వాల్వ్ అయ్యారు ?*

స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ అయ్యాను గాని, ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక, ఇక నేను ఈ సినిమాలో ఎక్కడ కూడా ఇన్‌వాల్వ్ కాలేదు. సెట్ కి ఒకే ఒక్క సారి వెళ్ళాను. అది కూడా వస్తే బాగుటుంది అని అడిగితేనే వచ్చాను. మ్యూజిక్ గురించి మాత్రమే వచ్చేవాళ్లు
పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా కొంచెం చూశా. కానీ మిగిలినవాటి గురించి అసలు పట్టించుకోలేదు.

*మీ అంచనాలను సినిమా చేసిన వాళ్లు అందుకోగలిగారా ?*

ఈ టీం సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని, ఇంతగా పనిచేసే వాళ్ళను నేను నా సెట్‌లో కూడా ఎక్కడా చూడలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ ఫుట్ మీద పూర్తి నమ్మకంతో చేశారు.

*ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది?*

నేను ఇప్పటివరకూ చేసిన సినిమాలు పెళ్లి చూపులు నుంచి కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన ఎమౌంట్‌లో 70శాతం ఈ సినిమాకే ఖర్చు పెట్టాను. మా డాడి కూడా మొదట్లో ఇప్పుడు ఎందుకురా మనకు ప్రొడక్షన్, యాక్టింగ్ మీద దృష్టి పెట్టకుండా..అని అన్నారు. కానీ స్క్రిప్ట్ బాగుంది అని చేసేశాం. అయితే గుడ్డిగా ఏమి చేయలేదు, ఈ టీమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రిస్క్ తీసుకుని సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు నా మీద డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ చిన్న ఇంట్లో రెంట్ కట్టుకుంటూ ఉండేవాడిని అందుకే నేను చేశా.

*మీకు మాత్రమే చెప్తా కథ మీద అంత నమ్మకంగా ఉన్నారు. సినిమాలో మీకు అంత నచ్చిన విషయం ఏంటీ?*

ఈ కథ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆడియన్స్ సినిమా హాల్ నుండి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు, ఈ రోజుల్లో హ్యూమర్ వర్కౌట్ అవుతుంది. సినిమా చేశాక, సినిమాని బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ఆడియన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు.

*ఇంకా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసే సినిమాలు చేస్తారా ?*

ప్రస్తుతానికి ఈ సినిమా చేశా… ముందు ముందు చేయాలని ఉంది చూడాలి.

*మీ తదుపరి సినిమాలు ఏంటీ?*

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఇంక ఎనిమిది రోజులు షూటింగ్ ఉంది. పురిగారితో చేయబోయే సినిమా జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. తరువాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది.