చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న “తధాస్తు”

568

హెచ్ .ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై నిర్మించబడుతున్నచిత్రం “తధాస్తు”అర్జున్ తేజ్,వర్షిణి హీరో హీరోయిన్లుగా తోట నాగేశ్వరరావు దర్సకత్వంలో రూపొందిస్తున్నఈ చిత్రం చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.సెంట్రల్ జైల్ లో జరిగే ఓ భారీ ఫైట్ తో పాటు హీరో జైల్ నుంచి విడుదలై హీరోయిన్ రిసీవ్ చేసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ నేపధ్యంలో నిర్మించే ఈ చిత్రంలో ఇతర తారాగణంగా ప్రసాద్ బాబు,భానునందర్,ప్రసన్నకుమార్,నాగ మహేష్,కోట శంకర్రావు,అలీ,ధన్ రాజ్,సాయాజీ షిండే,అర్జున్ రెడ్డి,రఘు మొదలైన వారు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక వర్గంగా సినిమాటోగ్రఫీ:సి.దండపాణి,సంగీతం:సాకేత్ నాయుడు,మాటలు:శ్రీకాంత్ దాలిపర్తి,పాటలు:తోట రామ్మెహనరావు,స్టంట్స్:జాషువా,ఎడిటింగ్:నందమూరి హరి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:విజయానంద్,లక్ష్మీనారాయణ,రఘునాధ్ చౌదరి,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్:కృష్ణ,పి ఆర్ ఓ:బి.వీరబాబు,నిర్మాత-కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం:తోట నాగేశ్వరావు.