‘యమ్‌6’ నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు కొత్త సినిమా

560


సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టి మొదట టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా కొన్ని సీరియల్స్‌ని సొంతంగా నిర్మించారు నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు. నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఇటీవల ‘యమ్‌6’ పేరుతో ఓ హారర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంతో విశ్వనాథ్‌ తన్నీరు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో తమ విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్‌లో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్‌ 6 విశ్వనాథ్‌ తన్నీరు పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు తమ కొత్త ప్రాజెక్ట్‌ గురించి తెలియజేస్తూ ”సినిమా మీద ప్యాషన్‌తోనే ఈ రంగంలోకి వచ్చాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాను. కొన్ని టీవీ సీరియల్స్‌ నిర్మించాను. ఆ అనుభవంతోనే ‘యమ్‌6’ చిత్రాన్ని నిర్మించాను. ఈరోజుల్లో చిన్న సినిమాలను నిర్మించి వాటిని సక్రమంగా విడుదల చేయడం అనేది కష్టతరమైన పని. మా సినిమా విడుదల విషయంలో కూడా నేను ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే నా నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో అలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్‌పై 6 నెలలు వర్క్‌ చేశాం. లవ్‌, కామెడీ, సెంటిమెంట్‌తోపాటు ప్రజెంట్‌ జనరేషన్‌కి మంచి మెసేజ్‌ని కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నాం. ఈ చిత్రాన్ని విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, విజయీభవ ప్రొడక్షన్స్‌ పతాకాలపై తెరకెక్కించనున్నాం. త్వరలోనే మా కొత్త సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం” అన్నారు.