‘హేజా’ మున్నాకాశికి నటుడిగా,దర్శకుడిగా మంచి గుర్తింపునిస్తుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లోత‌నికెళ్ళ భ‌రణి.

507

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు.. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం దసపల్లా హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో…

నటుడు త‌నికెళ్ళ భ‌రణి మాట్లాడుతూ – “ఎట్టి పరిస్థితులలోనూ హిట్ కొట్టాలనే లక్ష్యం, తపన తో ఈ సినిమా తీశారు దర్శకుడు మున్నా కాశి. కొత్త పాయంట్ తో వస్తోన్నచిన్న సినిమా, వైవిధ్యమైన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నఈ తరుణంలో వస్తోన్న ‘హేజా’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

స‌హ‌ నిర్మాత వి.ఎన్.వోలేటి మాట్లాడుతూ – “మున్నాకాశితో 2008 నుండి ట్రావెల్ చేస్తున్నాను. నాకు సినిమా రంగం మీద అనుభవం లేకున్నా మున్నా నరేట్ చేసిన విధానం, కథ నచ్చి ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా ఇంత తొందరగా ఓకే అవుతుంది అని మేము అనుకోలేదు.  అన్నారు.

దర్శక నిర్మాత మున్నాకాశి మాట్లాడుతూ – “హేజా అంటే బ్యూటిఫుల్ అని అర్ధం. తెలుగులో మ్యూజికల్ హారర్ జోనర్ లో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సినిమాలో ఒక డెవిల్ కి, మ్యుజిషియన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా. టెక్నికల్ గా చాలా బాగా ఉంటుంది. సినిమా చూడగానే ఒక బాక్సాఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.   అన్నారు.

నటీనటులు : మున్నా కాశి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ముమైత్ ఖాన్, నూతన నాయుడు, ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, భూష‌న్‌, ప్రీతం నిగమ్ తదితరులు…
సాంకేతిక నిపుణులు :
కథ, మాటలు,స్క్రీన్ ప్లే, సంగీతం,దర్శకత్వం – మున్నా కాశి
ప్రొడ్యూసర్: – కెవిఎస్ఎన్ మూర్తి
స‌హ‌నిర్మాత:- వి.య‌న్ వోలెటి
బ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
ఎడిటర్ : గ్యారీ బి హెచ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్