“రామా రావణ రాజ్యం” ఫస్ట్ లుక్ ఆవిష్కరణ.

547

వి3 ఫిలిమ్స్ పతాకం పై వినయ్ పరువెళ్ల , జ్యోతి హీరోహీరోయిన్లుగా రామ్ వికాస్. వి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “రామ రావణ రాజ్యం. ఈచిత్ర ఫస్ట్ లుక్ ను గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వికాస్ మాట్లాడుతూ’ పూర్తి యాక్షన్ చిత్రమిది. పాత, కొత్త ఆర్టిస్టుల కలయికతో ఈ చిత్రం తెర కెక్కనుంది. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకొనున్నాం.”అన్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి:రూషేంద్ర,ఎడిటర్:సాయి,పి.ఆర్.ఓ :బి.వీరబాబు,మ్యూజిక్:కనిష్క,ప్రొడ్యూసర్:వి3 ఫిలిమ్స్,కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం:రామ్ వికాస్. వి.