ఉగాది సందర్భంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” మొద‌టి సాంగ్ ‘లాయర్ పాప’ విడుద‌ల‌‌..

501


యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రోడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కొత్త దర్శకుడు కార్తిక్ శంక‌ర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్ప‌టికే టాకి పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా మొదటి పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తోంది.

లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న.. బెయిల్ ఇచ్చి పోరాదే..
పడిపోరాదే.. పడిపోరాదే.. నాకే నువ్వు పడరాదే..

అంటూ సాగే మాస్ బీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. పక్కా కమర్షియల్ పంథాలో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

న‌టీన‌టులు

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని త‌దిత‌రులు

టెక్నికల్ టీమ్:

స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌
బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల
ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ .. భ‌ర‌త్ రొంగాలి
పిఆర్ ఓ.. ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌
సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి
సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌
కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది ములే
ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి
డైర‌క్ట‌ర్‌.. కార్తిక్ శంక‌ర్‌