ఇండో నేపాల్ అండర్ 17 “కబడ్డీ” పోటీల్లో విజయ కేతనం ఎగురవేసిన అంబవరం ధనుంజయ రెడ్డి.

322

చిన్నప్పటినుండి కబడ్డీ అతని శ్వాస, అతని ధ్యాస. హైదరాబాద్ కూకట్ పల్లి వాస్తవ్యుడైన ధనుంజయ రెడ్డి కబడ్డీ లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి కి ఎదిగాడు.రీసెంట్ గా “యూత్ రూలర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా” ఆధ్వర్యంలో నేపాల్ లో ని ఖట్మాండ్ లో జరిగిన అండర్ 17 పోటీల్లో మెయిన్ ప్లేయర్ గా విజయకేతనం ఎగరవేశాడు.ఈ క్రమంలో తన కోచ్ బి. సింహాచలం అందించిన సహకారం వల్లే తనకీ అవకాశం లభించిందని ,ఆయనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులు మాధవ రెడ్డి, లక్ష్మీదేవి ఎన్నో వ్యయ ప్రయసాలకు ఓర్చి తనను ఈ స్థాయికి రావడానికి కృషి చేశారని , అలాగే మా ప్రిన్సిపాల్ మధు గారు చాలా ఎంకరేజ్ చేశారని, ఈ సందర్భంగా వారికి ఋణపడి ఉంటానని తెలిపారు. ఎప్పటికీనా “ప్రో కబడ్డీ” లో ఛాంపియన్ గా నిలవాలన్నదే తన జీవితాసాయమని ధనుంజయ రెడ్డి తెలిపారు.