11 గంటలకు వ్యూహం టీజర్‌ విడుదల…

283

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనే సంగతి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జీవి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సీయం వైయస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘వ్యూహం’ అనే పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. శ్రీ రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 24వ తేది ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన ట్వీట్టర్‌ ద్వారా తెలియచే శారు. ఈ సినిమా బయోపిక్‌ కాదు. దానికంటే లోతైన రియల్‌ సినిమా అని, ఈ చిత్రంలో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని గతంలోనే ఆర్జీవి తెలియచేసిన సంగతి తెలిసిందే. మామూలుగానే ఆర్జీవి ఏం చేసినా ట్రెండింగ్‌లో ఉంటారు. శనివారం విడుదలయ్యే టీజర్‌లో ఎటువంటి సంచలనాలు క్రియేట్‌ అవుతాయో అని సినిమా, రాజకీయం అనే తేడాలేకుండా అన్ని వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.