30 జాతీయ-అంతర్జాతీయ అవార్డులు గెలిచిన ‘ఎస్కేప్’ మూవీ గ్రాండ్ ప్రెస్ మీట్

162

బాణాల క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించిన ‘ఎస్కేప్’ చిత్రానికి బెస్ట్ స్టోరీ, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ కెమరామెన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఫిమేల్ సింగర్ ఇలా దాదాపు 30 జాతీయ-అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా ‘ఎస్కేప్’ మూవీ టీమ్ సినిమా విశేషాలను పంచుకోవడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో హీరోయిన్ శ్రుతి ఫులారి మాట్లాడుతూ.. మొదటి సినిమాకే ఇంత మంచి హీరోయిన్ క్యారక్టర్ అందులో సింగిల్ క్యారక్టర్ మూవీ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్కేప్ సినిమా 5 భాషల్లో విడుదల అవుతోందని, సినిమా విడుదల కు ముందే ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకోవడం అద్భుతమైన విషయం అని, ఈ అవకాశం ఇచ్చినందుకు డైరక్టర్ శ్రీధర్ బాణాలకు ధన్యవాదాలు తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతం కుమార్ పీ.ఏ మాట్లాడుతూ… ఎస్కేప్ సినిమా కొత్త తరహ షూటింగ్ విధానంతో కేవలం పది రోజులలో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, త్వరలో రిలీస్ కి సిద్దంగా ఉందని, ఈ సినిమాని చాలా ఎంజాయి చేస్తూ షూటింగ్ చేసామని తెలిపారు. అలాగే ఈ సినిమాకు పని చేయడం మంచి అనుభూతి అనీ, తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శ్రీధర్ బాణాలకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ఈ సినిమా కి పని చేసిన కెమరామెన్ అభిషేక్ మాతురి, ఎడిటర్ భాస్కర్ సాయి, కోడైరెక్టర్ సురేష్ కుశనపెల్లి సినిమా గురించి మాట్లాడుతూ వారి సంతోషాన్ని వ్యక్త పరిచారు.

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథతో దర్శకులు శ్రీధర్ బాణాల ఎంతో క్రియేటీవ్ గా తెరకెక్కించారని.. అలాగే ఈ చిత్ర యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల క్రిష్ ఒక పాటని అందించగా, మరో పాటని వెంకట్ ఐనాల అందించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ జె. భాను ప్రసాద్ సమకూర్చారు.

ప్రస్తుతం ‘ఎస్కేప్’ చిత్రం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని.. త్వరలోనే పనులు ముగించుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఇప్పటికే మాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని రెండు పాటలని విడుదల చేశామని, అవి ప్రేక్షకులను అలరిస్తున్నాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతమ్ కుమార్ పీ.ఏ తెలిపారు.

బ్యానర్ : బాణాల క్రియేటివ్ వర్క్స్
నటీనటులు : శ్రుతి ఫులారి

సాంకేతిక విభాగం

డైరెక్టర్ : శ్రీధర్ బాణాల
సినిమాటోగ్రఫీ : అభిషేక్ మాతురి
ఎడిటర్ : భాస్కర్ సాయి
సంగీత దర్శకుడు : ప్రజ్వల క్రిష్, వెంకట్ ఐనాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గౌతమ్ కుమార్ పీ.ఏ
బ్యాగ్రౌండ్ స్కోర్ : జే. భాను ప్రసాద్
కో-డైరెక్టర్ : సురేష్ కుశనపల్లి
పీఆర్ఓ : హరీష్, దినేష్