నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ ‘18 పేజెస్’ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు..

365

 

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన డబ్బింగ్ మొదలు పెట్టారు. ఓ వైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్
కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్
నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫర్: ఏ వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: గోపీ సుందర్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్