ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ “చిత్రం X”

2027

హారర్ కామెడీ, రొమాటింక్ హారర్ చిత్రాలకు వెండితెరపై తిరుగు లేదు. ఎన్నో సినిమాలు ఈ జానర్ లో తెరకెక్కి ఘన విజయాలు సాధించాయి. ఓ సూపర్ హిట్ ఫార్ములాను క్రియేట్ చేశాయి. అలాంటి పాయింట్ తో తెరకెక్కిన సినిమానే “చిత్రం X”. న్యూ ఇయర్ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం X సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథలోకి వెళ్తే..

మద్దికుంట ఫారెస్ట్ లోకి రీసెర్చ్ కోసం ఆరుగురు టీనేజర్స్ వెళ్తారు. పురాతన భవంతిలో తమ పరిశోధన చేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఊహించని ఘటనలు వారికి ఎదురవుతుంటాయి. పరిశోధన కోసం వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా చంపుతుంటుంది అడవి కన్య సింధూర. హీరో హీరోయిన్లు మాత్రం సింధూర బారి నుంచి తప్పించుకుంటారు. అసలీ సింధూర ఎవరు, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి, సింధూర నుంచి హీరో, హీరోయిన్లు ఎలా తప్పించుకున్నారు. చివరకు సింధూరకు న్యాయం జరిగిందా లేదా అనేది తెరపై చూడాల్సిన మిగిలన కథ.

నటీనటుల ఫర్మార్మెన్స్

”చిత్రం X” ఒక హారర్ థ్రిల్లర్. ఇలాంటి కథను నడిపించే హీరో డైనమిక్ గా ఉండాలి. మిగతా వారిని ముందుండి నడిపించాలి. ధైర్యం, సాహసాలు అతని హావభావాల్లో కనిపించాలి. హీరో రాజ్ బాలా ఇలాంటి ఫర్మార్మెన్స్ నే చూపించాడు. ప్రతి సన్నివేశంలో నటుడిగా అతని కాన్ఫిడెన్స్ కనిపించింది. ఫైట్స్, డాన్స్ లు, రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సిచ్యువేషన్స్…అన్నింట్లో హీరో రాజ్ బాలా ఆకట్టుకున్నాడు. పెద్ద స్పాన్ ఉన్న సినిమాల్లోనూ మెప్పించగలననే ఇండికేషన్ ఇండస్ట్రీకి పంపాడు. హీరోయిన్ మానస సరదాగా, హాట్ గా రెండు రకాలుగా నటించింది. మిగతా నటీనటులు పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితనం

చిన్న చిత్రమైనా ఉన్నంతలో బాగా నిర్మించారు నిర్మాత పొలం గోవిందయ్య. ఉన్న బడ్జెట్ లో విజువల్ ఎఫెక్టులు చేయించి హారర్ సినిమా కలర్ తీసుకొచ్చారు. దర్శకుడు విభూది రమేష్ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మంచి ఫ్యూచర్ ఉన్న దర్శకుడు అనిపించారు. శివ నందిగం పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శివ కుమార్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకోలేదు. ఉన్న పరిమితుల్లో ఫైట్స్, డాన్స్ లు బాగానే ఉన్నాయి.

చివరగా..

ఇప్పుడే థియేటర్లు ఒక్కొక్కటిగా తెరుస్తున్నారు. సినిమాలను థియేటర్లో చూడాలని ప్రేక్షకులూ ఎదురుచూస్తున్నారు. సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ కోసం “చిత్రం X” సినిమాను ఒకసారి చూడొచ్చు. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఇంకా బాగా నచ్చే అవకాశముంది.

నటీనటులు – రాజ్ బాల, మానస, చందన, కావ్య, కల్పన, పలాస శ్రీను, బాచి, సునీల్, రావి నూతల, శ్యాం పిల్లల మర్రి, ఆనంద్ తదితరులు

సాంకేతిక నిపుణులు – సంగీతం – శివ నందిగం, ఎడిటింగ్ – శివ కుమార్ ఆకుల, డాన్స్ – కపిల్ మాస్టర్, ఫైట్స్ – అంజి, సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ కె కావలి, నిర్మాత – పొలం గోవిందయ్య, దర్శకత్వం – రమేష్ విభూది

 

రేటింగ్ 3/5