గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చాణక్య`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్, పోస్టర్స్‌తో పాటు ఇప్పుడు విడుదలైన టీజర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి. వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్