కోలీవుడ్ పై అనుపమా కన్ను!

558

అనుపమా పరమేశ్వరన్‌ ‘ప్రేమమ్‌’ వంటి మలయాళ హిట్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ భాషల్లోనూ అవకాశాలు వరించాయి. అయితే, అందులో విజయాలు బాగా తక్కువ. తెలుగులో మాత్రం అవకాశాలు వరుస కడుతున్నాయి. చాలా కాలం తరువాత తమిళంలో రెండో అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో నాని, నివేదాథామస్‌ కలిసి నటించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్‌ అవుతోంది. లక్కీగా ఇందులో నటి అనుపమా పరమేశ్వరన్‌ నాయకిగా నటించే అవకాశం వరించింది. అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది.ఇకపై ఎక్కువగా కోలీవుడ్ పై ఎక్కువగా ఆసక్తి పెంచాలనుకుంటోందిట.