శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయం అవుతూ, పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధర్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుదర్శన్ హనగోడు నిర్మిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన నటుడు శివాజీరాజా ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి హీరో, హీరోయిన్, దర్శకుడు ఇలా అన్నీ రమాకాంతే. మూడేండ్లు ఈ కథని మోస్తూ వస్తున్నాడు. అనుకున్న అవుట్‌పుట్ రావడం కోసం రాజీపడకుండా వర్క్ చేశాడు. ప్రతి సీన్ బాగా రావడం కోసం ఎంతో తపించాడు. అజయ్ ఘోష్, నాగబాబు, వెన్నెల కిషోర్ వంటి పెద్దపెద్ద ఆర్టిస్టులను ఎంచుకున్నారు .
చిత్ర దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ, ‘నన్ను నమ్మి వాళ్ళ అబ్బాయిని నా చేతుల్లో పెట్టిన శివాజీరాజాకి థ్యాంక్స్. బాబీ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. డార్క్ కామెడీ హర్రర్ థ్ల్రిలర్‌గా సినిమాని రూపొందించాం. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఏప్రిల్ ఫస్ట్‌న పుట్టిన ముగ్గురు ఫూల్స్ చేసే స్టూపిడ్ పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులో పడ్డారనే కథాంశంతో తెరకెక్కించాను.
హీరో విజయ్ రాజా చెబుతూ, ‘నేనీ స్థానంలో ఉండటానికి కారణమైన మా తల్లిదంద్రులకు థ్యాంక్స్. బాబీ సింహా పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. రవి, రాఘవ సెట్‌లో నాకు ధైర్యాన్నిచ్చారు. నాతో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టులకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో సినిమా తీసిన దర్శకుడు రమాకాంత్‌కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆయనకు రుణపడి ఉంటాను’ అని అన్నారు.
ఏదైనా జరగొచ్చు ట్రైలర్ లాంచ్
RELATED ARTICLES