అందరూ కొత్తవాళ్లతో చేసిన మంచి సినిమా ‘నీ కోసం’ – నీ కోసం ట్రైలర్ లాంచ్ లో బెక్కం వేణుగోపాల్

552

వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం ‘నీకోసం’.అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్వి డుదలైంది. కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తూనే కథ, కథన పరంగా సర్ప్రై జింగ్ ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి ఈ ట్రైలర్ లో.

ఈ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నేను చూశాను. నాకు బాగా నచ్చింది. దర్శకుడు అవినాష్ ఈ కథను బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాతో మరో ప్రతిభావంతమైన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడని చెప్పగలను. అందరూ కొత్తవాళ్లతో చేసిన గొప్ప సినిమా ఇది. సిస్టర్సెం టిమెంట్ సీన్స్ హైలెట్ గా ఉంటాయి. ఊహించని మలుపులతో.. మంచి బడ్జెట్ లో తీసిన ఈ సినిమా క్వాలిటీ పరంగానూ బాగా ఉంటుంది. ఆర్టిస్టులందరూ బాగా చేశారు. మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టులు. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూ నీకోసం మూవీ టీమ్ కు ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.

హీరో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ .. ‘అందరం కొత్తవాళ్లమే. అయినా చాలా కొత్తదనం ఉన్న కథతో వస్తున్నాం. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన మంచి కథ ఇది. స్క్రీన్ ప్లే పరంగా కొత్త ఫీల్ ని ఇచ్చే సినిమా ఇది. యూత్ అంతా ఈ కాన్సెప్ట్ తో రిలేట్ అవుతారు. చాలామంది తమను తాము ఈ పాత్రల్లో చూసుకుంటారు. ఎక్కడా బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది’ అన్నారు..

మరో హీరో అజిత్ రాధారామ్ మాట్లాడుతూ… ‘ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యే కథ ఇది. ఓ మంచి కథతో వస్తున్నాం.. మీ అందరి ఆశిస్సులు కావాలి’ అని అన్నారు.

హీరోయిన్ సుభాంగి పంత్ మాట్లాడుతూ … ‘ఈ టీమ్ తో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు.. మీరు ఊహించిన కొన్ని ట్విస్ట్ లు కూడా ఉంటాయి.. నీకోసం అనే పదం విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో.. అలాంటి ఫీల్ సినిమా అంతా కనిపిస్తుంది..’అన్నారు.

దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ … ‘ఇప్పటి వరకూ సినిమా చూసిన పెద్దలందరూ చాలా బావుందని మెచ్చుకున్నారు. సిన్సియర్ గా మంచి సినిమాను తీశాం. విడుదల తర్వాత ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ.. చూసిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని మాత్రం చెప్పగలను. ఒక మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ మాత్రం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. మీరు మర్చిపోయిన.. లేదా వదిలేసిన రిలేషన్స్ అన్నీ మీకు మళ్లీ గుర్తొస్తాయి. ఇది కేవలం యూత్ కోసం మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ డ్రైవ్ లాంటి సినిమా.. ’ అని అన్నారు.

రాజలింగం సమర్పణలో నవీన్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్యానర్: తీర్ధ సాయి ప్రొడక్షన్స్ప్రొ డ్యూసర్: అల్లూరమ్మ (భారతి) సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్ఎ డిటింగ్ : తమ్మిరాజు ఆర్ట్: క్రాంతి ప్రియ రచన, దర్శకత్వం : అవినాష్ కోకటి.