అమృత సత్యన్నారాయణ క్రియేషన్స్ పతాకంపై శరవేగంగా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ no 1

852


సుమన్ కవిత..ప్రధాన పాత్రల్లో, అలం సందీప్, ప్రమీల హీరోహీరోయిన్లుగా, బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో, ఏ.వి.భాస్కర్ నిర్మిస్తున్న సినిమా ఫైనల్ షెడ్యుల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏ.వి.భాస్కర్ మాట్లాడుతూ: ఇప్పటివరకు మంచిర్యాల కోనసీమ లలో రెండు షెడ్యూల్స్ నీ జరిపాము. ఇప్పుడు జరుగుతున్న షెడ్యుల్ తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అవుతుంది. త్వరలో టైటిల్ ను ఎనౌన్స్ చేస్తాము. ఆడియోను జనవరి 24న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాము. దర్శకుడు మాకు ఏదైతే చెప్పాడో అంతె క్లియర్ గా సినిమాని తెరకెక్కిస్తున్నారు. కొత్తగా సినిమాని నిర్మిస్తున్న మాకు సుమన్ కవిత గారు మంచి సపోర్ట్ చేసారు. నటి నటుల టెక్నీషియన్స్ సహకారం బాగుంది.మంచి కథతో మంచి సినిమాని నిర్మిస్తున్నాం అని అన్నారు.

దర్శకుడు బొంతు శ్రీనివాస్ మాట్లాడుతూ: విభిన్న కథ కథనాలతో నేటి ట్రెండ్ కి తగ్గట్టు గా ఈ సినిమా వుంటుంది. సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెండు షెడ్యుల్ నీ పూర్తి చేసాము. సినిమా బాగా వస్తుంది.నిర్మాత సహకారం మరచిపోలేను. త్వరలో టైటిల్ ను ఎనౌన్స్ చేస్తాము అన్నారు.

సుమన్, కవిత..ప్రధాన పాత్రల్లో, అలం సందీప్, ప్రమీల హీరోహీరోయిన్లుగా, జెన్నీ, అశా,విజయభాస్కర్, కాకినాడ నాని, సాయి వర్ధన్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు.

నిర్మాత: A.V. భాస్కర్ రావు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వం: బొంతు శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: శూలం ప్రసాద్
మ్యూజిక్: చిన్ని కృష్ణ
ఎడిటింగ్: వి.నాగిరెడ్డి
డాన్స్: బండ్ల.రామారావు
ఫైట్స్: అవినాష్
పాటలు: మాతుమురి రామారావు.