ప్రతిరోజు పండగే సాయి ధరమ్ తేజ్, మారుతి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ !!!

540

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ప్రతిరోజు పండగే. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉంది, మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. సాయి తేజ్ నటన, రావు రమేశ్ పర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ సినిమాకు కలిసి వచ్చాయి. ఎమోషన్ సీన్లు బలవంతంగా ఉన్నాయి.

సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుండి పాజిటీవ్ టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అలాగే మారుతి యూవీ, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గతంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ తరువాత ప్రతిరోజు పండగే సినిమా వారి కాంబినేషన్ లో మరో హిట్ సినిమాగా నిలిచిందనడంలో సందేహం లేదు.