తేజ సజ్జ ‘అద్భుతం’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు..

329

నవంబర్ 19న హాట్ స్టార్ డిస్నీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా అద్భుతం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ ఇందులో నటించారు. ఆయనకు జోడీగా రాజశేఖర్ కూతురు శివానీ నటించారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో వచ్చిన అద్భుతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రే హాట్ స్టార్‌లో ఈ ‘అద్భుతం’ సినిమా చూశాను. ఇదొక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జ, శివానీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వాళ్లిద్దరూ చాలా ఇంప్రెసివ్‌గా నటించారు. చిత్ర బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉంది..’ అంటూ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు మల్లిక్ రామ్‌ను ట్యాగ్ చేసి మరీ తన ప్రోత్సాహాన్ని అందించారు చిరంజీవి.

నటీనటులు:
తేజ సజ్జ, శివానీ రాజశేఖర్, సత్య తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: మల్లిక్ రామ్
నిర్మాతలు: మండవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు
కథ: ప్రశాంత్ వర్మ
సినిమాటోగ్రఫర్: విద్యాసాగర్
సంగీతం: రాధన్
స్క్రీన్ ప్లే, మాటలు: లక్ష్మీ భూపాల
పిఆర్ఓ: ఏలూరు శ్రీను