ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ “కిస్ మి” చిత్రం ప్రారంభం.

120

ఎం ఏ చౌదరి దర్శకత్వంలో ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ పతాకంపై సునీల్ మారుశెట్టి నిర్మిస్తున్న చిత్రం “కిస్ మి”. ఈ చిత్ర ప్రారంబోత్సవ కార్యక్రమం సారధి స్టూడియోలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ తో ఘనంగా జరిగింది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మారిశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రెడి చేశారు. ఇది మా బ్యానర్లో మూడో చిత్రం. ఈ కథసినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఆగస్టు మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు.

దర్శకుడు ఎమ్ ఏ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం లోనూతన నటీనటులు నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ మా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. శ్రీలంక కు చెందిన ప్రముఖ హీరోయిన్ పూర్విక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. మంచి టాలెంట్ ఉన్న నటి పూర్విక. ఇతర సీనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. ఆగస్ట్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసాము. రెండవ షెడ్యూల్ గోవా లో జరుగుతుంది. రెండు షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు.

నటుడు ఖదీర్ మాట్లాడుతూ ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రాజక్ట్ ఇంచార్జ్ అజిత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో కిస్ మి చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంది అన్నారు.

సంగీతం దర్శకుడు షాహిక్ పర్వీజ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.

మూలకథ: అహ్మద్, డాన్స్: రాజుసుందరం, ఫైట్స్: విజయన్, పీఆర్ ఓ: రమేష్ చందు, నిర్మాత: మారుశెట్టి సునీల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం ఏ చౌదరి.