ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అలా ఇలా ఎలా’

108

ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలకు, చిత్ర టీజర్, ట్రైలర్స్ లకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎస్.కె.ఎం. ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూన్ 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి ఈ నెల 21 న విడుదల అవుతున్న అలా ఇలా ఎలా సినిమాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

*అనంతరం అతిధిగా వచ్చిన డ్యాన్స్ కోరియోగ్రాఫర్ & డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..* మంచి ఫ్యాన్సీ టైటిల్ తో వస్తున్న ‘అలా ఇలా ఎలా’ మూవీ బిగ్ హిట్ అయ్యి దర్శకుడికి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు.

*కొరియోగ్రాఫర్ అశోక్ మాట్లాడుతూ..* కళ మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు రాఘవ గారు, నిర్మాత కోల్లకుంట నాగరాజు సినిమాలో పెద్ద ప్యాడింగ్ పెట్టుకోని చాలా మంచి సినిమా తీశారు. ఈ సినిమా చూశాను ఇందులో నటించిన వారంతా అద్భుతంగా నటించారు. సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నిర్మాత నాగరాజు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తియ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

*చిత్ర నిర్మాత కొల్లకుంట నాగరాజు మాట్లాడుతూ..* ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో శక్తి హీరోగా చాలా బాగా నటించాడు. ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు బ్రహ్మానందం, అలీ, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్ ఇలా అందరూ చాలా అద్భుతంగా నటించారు. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. జులై 21న ఎస్.కె. ఎం.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా థియేటర్స్ లలో విడుదల అవుతున్న “అలా ఎలా ఇలా” సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*చిత్ర దర్శకుడు రాఘవ ద్వారకి మాట్లాడుతూ..* కర్ణాటకలో పుట్టిన నేను చిరంజీవి గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమారంగంలోకి రావడం జరిగింది. కన్నడలో 6 సినిమాలు చేశాను. తమిళ్ లో కూడా సినిమా చేశాను. తెలుగులో నాకిది మెదటి చిత్రం. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. చూస్తున్న ప్రేక్షకులకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్రితో వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మాత కొల్లకుంట నాగరాజు ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచి ఈ సినిమాను నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి మా సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. ఈనెల 21 న విడుదల అవుతున్న మా సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*చిత్ర హీరో శక్తి వాసు మాట్లాడుతూ..* తెలుగు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకిది మొదటి చిత్రం. మంచి కాన్సెప్ట్ ఉన్న అలా ఇలా ఎలా సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

*గెస్ట్ గా వచ్చిన నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..* మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు రావాలని అన్నారు.

*డైలాగ్ రైటర్ రాఘవ మాట్లాడుతూ..* ఈ సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అలీ, బ్రహ్మానందంల కామెడీ చాలా హిలేరియస్ గా ఉంటుందని అన్నారు.

*డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ మాట్లాడుతూ..* ఈ సినిమాలో శక్తి గారు హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో కూడా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ద్వారా తనకు మంచి పేరు వస్తుంది. తనతో పాటు ఇందులో నటించిన వారంతా చాలా డెడికేషన్ తో నటించారు. నిర్మాత నాగరాజు ఈ సినిమా కొరకు చాలా కష్టపడి నిర్మించారు. ఈ నెల 21 న విడుదల అవుతున్న ఈ సినిమా 250 థియటర్స్ లలో రిలీజ్ అవుతుందని అన్నారు.

నటీనటులు :
శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత తదితరులు

సాంకేతిక బృందం
నిర్మాత : కొల్లకుంట నాగరాజు
దర్శకుడు : రాఘవ
కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్
సంగీతం : మణిశర్మ
యాక్షన్ డైరెక్టర్ : రాజశేఖర్
డాన్స్ మాస్టర్ : శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన
ఎడిటర్ : జాషి ఖ్మెర్
పీఆర్వో : సాయి సతీష్